Investments: మిడిల్ ఈస్ట్ లో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఎదిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ఇండియాలో 50 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చర్చలు సైతం షురూ అయినట్లు వెల్లడించింది. భారత్ తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చూస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న మోదీ సర్కారు.. మరింత ఫాస్ట్ గా దూసుకెళ్లేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. మరోసారి దేశంలోకి పెట్టుబడుల వరద పారించాలని చూస్తోంది. ఇందు కోసం మిత్ర దేశాలతో ప్రధాని చర్చలు జరుపుతున్నారు.

ఈ వ్యవహారంలో UAE ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ హిన్ జాయెద్ సోదరుడు, ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడు అయిన తహ్నూన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే చర్చలు జరుగుతున్న పెట్టుబడుల్లో.. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA), ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్ మరియు ADQ వంటి సావరిన్ వెల్త్ ఫండ్‌లు ఉండవచ్చని తెలుస్తోంది.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే UAE తన నిర్ణయాలను ప్రకటించవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ఒప్పందాలు ముఖ్యంగా ఇండియాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తుల్లో వాటాలకు సంబంధించి ఉండవచ్చని వెల్లడించింది. అయితే 2022-23లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 84.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని దేశాధినేతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications