అమెరికాలో ఆర్థికమాంద్యం ముప్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి ఇటీవల యుఎస్ recession మీద ఒక హెచ్చరిక విడుదల చేశారు. ఆయన ప్రకారం అమెరికా జిడిపిలో మూడింట ఒక వంతు వాటా కలిగిన రాష్ట్రాలు ఇప్పటికే మాంద్యంలో ఉన్నాయని, లేదా మాంద్యం 'అధిక ప్రమాదం'కు చేరుకున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మాంద్యం ప్రభావం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మిడ్‌వెస్ట్, రస్ట్ బెల్ట్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. ఇది పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తోందని హెచ్చరించారు.
మార్క్ జాండి ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఆర్థిక మాంద్యం సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ వంటి పెద్ద రాష్ట్రాలు మాత్రమే కొంచెం స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాలు కలిపి అమెరికా జిడిపిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగంగా నిలుస్తున్నాయి.

ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రధానంగా వ్యవసాయం, తయారీ, నిర్మాణం రంగాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ రంగాలు ప్రత్యేకంగా గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలలో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ట్రంప్ పరిపాలనలో తాజా సుంకాలు విధించడం.. అలాగే ఇతర దేశాల ప్రతిస్పందన చర్యలు ఈ రంగాలపై మరింత పతనానికి కారణమవుతున్నాయని మార్క్ జాండి పేర్కొన్నారు. వాషింగ్టన్ DC ఆర్థిక వ్యవస్థ కూడా భారీ కోతల కారణంగా మందగింపును అనుభవిస్తోందన్నారు.
అయితే ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, రియల్ ఎస్టేట్ రంగాలు ఇప్పటికీ అభివృద్ధి మార్గంలో ఉన్నాయంటూ మార్క్ జాండి వెల్లడించారు. ఆర్థిక సేవలు, రిటైల్, ఆతిథ్యం రంగాలు కూడా నిరంతర ఆదాయంతో ముందుకు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. US మాంద్యంలో ఉందా అన్న ప్రశ్నకు మార్క్ జాండి ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.
నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER) ప్రకారం.. వరుసగా రెండు త్రైమాసికాల GDP ప్రతికూల వృద్ధి మాంద్య సూచిక. అయితే, రెండవ త్రైమాసికంలో GDP పెరుగుదల ఉండటంతో, అమెరికా సాంకేతికంగా మాంద్యాన్ని దాటి ముందుకు పోయింది. అయినప్పటికీ మాంద్య ముప్పు పూర్తిగా తీరలేదని మూడీస్ చీఫ్ ఎకనామిస్ట్ హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, పెట్టుబడిదారులు, వ్యాపారులు, పాలకులు జాగ్రత్తగా ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మార్క్ జాండి సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్న ఈ సమయంలో అమెరికా కూడా మాంద్య సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకుని ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉందని చెబుతున్నారు.
More From GoodReturns

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీన్ని బ్లాక్ చేస్తే భారత్‌కు నష్టమేంటి?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్



Click it and Unblock the Notifications