Mutual Funds Types: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది. రిస్క్ తో కూడుకున్నవే అయినా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తుండటంతో పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యువత కూడా ఈ మధ్యనే వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు క్యూ కడుతున్నారు. కానీ సరైన అవగాహన లేకుండా ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనలు తీసుకోకుండా కనిపించిన ఫండ్లలో పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా మూడు రకాల ఈక్విటీ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. అవి లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్. అయితే ఈ ఫండ్స్ నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటాయని గమనించాలి. తద్వారా మార్కెట్ ఒడిదురుకులకు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అయితే వీటికి మరికొన్ని ఇతర డెట్, ఇంటర్నేషనల్, గోల్డ్, బాండ్స్ వంటి ఇతర కేటగిరీలకు చెందిన సాధనాలను యాడ్ చేసుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.

మార్కెట్ విలువపరంగా టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ గా సెబీ వర్గీకరించింది. వీటి మార్కెట్ క్యాప్ 20 వేల కోట్లు కంటే ఎక్కువగా ఉంటుంది ఇతర కంపెనీలతో పోలిస్తే అత్యధిక స్థిరత్వం వీటి సొంతం. వీటినే బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్ . టాప్ 101-250 స్థాయిలోని కంపెనీలను మిడ్ క్యాప్ గా పరిగణిస్తారు. వీటి మార్కెట్ వాల్యూ 5-20 వేల కోట్లు లోపు ఉంటుంది. 251 నుంచి మిగిలి ఉన్న కంపెనీలను స్మాల్ క్యాప్‌గా చెబుతారు. స్టార్ట్ అప్స్ లేదా ఇటీవల స్థాపించబడిన కంపెనీలు ఇందులో ఉంటాయి కాబట్టి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది.
వివిధ అంశాల వారీగా కూడా ఈ ఫండ్స్ మధ్య తేడాలు ఉన్నాయి. సాధారణంగా చాలామంది ఎక్కువగా రిస్క్ గురించి మాట్లాడుతుంటారు. అయితే వాలటాలిటీ, లిక్విడిటీ అనేవి కూడా ముఖ్యమని గమనించాలి. ఏవైనా ప్రత్యేక సందర్భాలు మినహా సాధారణ రోజుల్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంతగా ఇంపాక్ట్ అవ్వవు. గత పది ఏళ్లలో వీటి వార్షిక రాబడి 13-15 శాతంగా ఉంది. ఇక మిడ్ క్యాప్ అయితే కాస్త అటు ఇటుగా ఉంటాయి. రిస్క్, లిక్విడిటీ, వాలిటరిటీలు స్మాల్ క్యాప్ తో పోలిస్తే లార్జ్ క్యాప్‌లో బెటర్ గా ఉంటాయి. చివరగా స్మాల్ క్యాప్స్ కేటగిరీ అత్యధికంగా 18-22 శాతం రిటర్న్స్ జనరేట్ చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications