Mukesh Ambani ఫ్రెండ్ అంటూ యూట్యూబర్ రచ్చ.. యాంటీలియా ముందు ఏమైందంటే..?
Ambani's Antilia: భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఆసియా కూడా ధనికుడిగా ఉన్న అంబానీ తన స్థాయికి తగిన ఇంట్లోనే ముంబైలో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటి ధర సౌదీలోని బూర్జ్ ఖలీఫా కంటే ఖరీదైనదిగా తెలుస్తోంది. అనేక ఆధునిక హంగులు కలిగిన ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వటం అంత ఈజీ కాదని తెలిసిందే.
కానీ సోషల్ మీడియాలో కంటెట్ క్రియేటర్లు మాత్రం తమ రీచ్ కోసం రోజుకో పిచ్చిపని చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి అంబానీకి చెంది ఇల్లు యాంటీలియా వద్ద కూడా జరిగింది. అవును అంబానీ ఇంట్లోకి ప్రవేశించి వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఎల్లప్పుడూ ఇంటి చుట్టూ 24 గంటల పాటు ప్రభుత్వం అందించే సెక్యూరిటీతో పాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా అక్కడ పహారాలో ఉంటుంది.

యాంటిలియా అని పిలువబడే ఈ విలాసవంతమైన నివాసం ఆధునిక సౌకర్యాలతో పాటు సెక్యూరిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ క్రమంలో బెన్ సుమదివిరా, అరిస్ యెగెర్ అనే ఇద్దరు కంటెంట్ క్రియేటర్లు అంబానీ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది అక్కడ ఉండే భద్రతా వలయం ఎంత కఠినంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా లోపలికి వెళ్లటానికి ప్రయత్నించిన వీరిని గార్డులు గెంటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో యూట్యూబర్లిద్దరూ అంబానీ స్నేహితులమని, ఆయనను కలవటానికి అక్కడికి వచ్చామంటూ చెప్పారు. అయితే అక్కడి సెక్యూరిటీ మాత్రం వారిద్దరినీ లోనికి పోనియ్యలేదు. ప్రస్తుతం ఈ వీడియోను 50 మిలియన్ల మందికి పైగా చూశారు. ఈ క్రమంలో సదరు యూట్యూబర్లు, అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన సంభాషనను సైతం వారు పోస్టులో పెట్టారు. ఈ క్రమంలో వారు ఆనంత్-రాధిక మర్చంట్ పెళ్లికి హాజరయ్యామని, ప్రస్తుతం ఆంటిలియా నివాసంలో వారిని కలవాలని ముఖేష్ అంబానీ ఆహ్వానించారంటూ చెప్పిన మాటలను అక్కడి సిబ్బంది అస్సలు నమ్మలేదు.
వాస్తవానికి అంబానీ లాంటి వ్యాపారవేత్త ఇంటికి వెళ్లే వారికి ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుంది. అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించిన వ్యక్తి యాక్సెస్ చేసేందుకు సెక్యూరిటీకి వారి వివరాలను అందించటంతో పాటు కోఆర్డినేట్ చేసేందుకు వ్యక్తులను సైతం ముందుగానే నిర్థేశిస్తారు. కానీ యూట్యూబర్లు అత్యుత్సాహం ప్రదర్శించటం అంబానీ యాంటీలియా సెక్యూరిటీకి అస్సలు నమ్మసక్యంగా లేకపోవటంతో ఇదేమీ రెస్టారెంట్ కాదంటూ అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీడియోల కోసం యూట్యూబర్లు ఇలాంటి తలతిక్క పనులు మానుకోవాలని కొందరు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications