ఆర్బీఐ సంచలన విషయాలను వెల్లడించింది. వ్యవస్థలో ఇంకా రూ.2000 నోట్లు మూలుగుతున్నాయని తెలిపింది. నోట్ల రద్దు జరిగినా ఇంకా ప్రజల మధ్యనే రెండు వేల నోట్లు ఉన్నాయని తాజా రిపోర్టులో తెలిపింది. మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. రెండు వేల రూపాయిల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుని దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది.
అయినప్పటికీ రెండు వేల రూపాయల నోట్ల రద్దు జరిగి రెండేళ్లు గడిచినా ఇంకా ప్రజల దగ్గర ఆర్బీఐ నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇంకా ప్రజల దగ్గర రూ.6,181 కోట్ల విలువైన గల రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

నోట్ల రద్దు సమయానికి అంటే మే 19, 2023వ తేదీ నాటికి మొత్తం చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ విలువ మే 31 2025 నాటికి రూ.6,181 కోట్లకు తగ్గిందని RBI తన తాజా నివేదికలో వెల్లడించింది. గతంలోనే నోట్ల మార్పిడికి అవకాశం అవకాశం ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకు శాఖలలో ఈ నోట్లను మార్పిడి చేసుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.ఈ కార్యాలయాలు ఇప్పటికీ ఎవరి దగ్గరైనా నోట్లు ఉంటే వారు ఆ రెండు వేల నోట్లను బ్యాంక్ ఖాతాలలో జమచేయడానికి అంగీకరిస్తున్నాయి. ప్రజలు దేశంలోని ఏ పోస్టాఫీసు నుండైనా, ఆర్‌బీఐ జారీ చేసిన ఏ కార్యాలయానికైనా ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను పంపించవచ్చు. వారు మీ ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు. అయితే రూ. 2 వేల నోటును రద్దుచేసినా అది ఇంకా చట్టబద్దమైన ద్రవ్యంగానే కొనసాగుతోంది.
బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు దీనిని జారీ చేయనప్పటికీ అధికారికంగా వీటిని ప్రజలు చెల్లింపు ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు. ఆర్బీఐ జారీ చేసిన నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రెండు వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. అక్కడకు వెళ్లలేని వారు ఆ కార్యాలయాలకు పోస్ట్ ద్వారా మీ నోట్లను పంపించినా సరిపోతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications