కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జీఎస్టీ రీ-స్ట్రక్చరింగ్ ప్రతిపాదన రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ సంవత్సరం దీపావళి నాటికి పరోక్ష పన్ను వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం, ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% పన్ను శ్లాబులను తొలగించి వాటి స్థానంలో 5%, 18% వంటి రెండు ప్రధాన శ్లాబులు ఉండేలా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చర్యల వల్ల సాధారణ గృహ కొనుగోలుదారులకు సానుకూలమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయా? లేక నిర్మాణ రంగం మార్జిన్ ను కాపాడుకునే దిశగా వెళ్తుందా? అనేది కీలక ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక యూనిట్ నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్‌పై 28 శాతం, స్టీల్‌పై 18 శాతం, టైల్స్, శానిటరీ వేర్‌పై 18 శాతం నుండి 28 శాతం వరకు GST వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం నిర్మాణ వ్యయంపై ఇది భారీగానే ప్రభావం చూపుతోంది. దీంతో గృహాల ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వస్తున్న రెండు-శ్లాబ్ జీఎస్టీ విధానం క్రింద ఈ వస్తువులపై పన్ను 18 శాతంకు పరిమితం చేస్తే డెవలపర్‌లు నిర్మాణ వ్యయంలో సరాసరి 8 శాతం నుండి 10 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

వాస్తవానికి నిర్మాణంలో ఉన్న గృహాలపై ప్రస్తుతం 5శాతం GST (సరసమైన గృహాలకు 1%) ఉంటుంది. అయితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సిద్ధంగా ఉన్న గృహాలపై GST వర్తించదు. దీంతో నిర్మాణంలో ఉణ్న ప్రాజెక్టులపై ఉన్న పన్ను భారం కొనుగోలుదారులకు నేరుగా ప్రభావితం అవుతుంది. లగ్జరీ గృహాలకు సంబంధించి 40 శాతం ప్రత్యేక పన్ను రేటును ప్రభుత్వం తెచ్చే అవకాశం ఉందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.
లగ్జరీ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన సాయా గ్రూప్ MD వికాస్ భాసిన్ కేంద్రం ప్రతిపాదనను స్వాగతించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై GST తగ్గింపు ద్వారా కొనుగోలుదారులకు అర్థవంతమైన ఉపశమనం లభిస్తుంది. ఇది మార్కెట్‌లో సెంటిమెంట్‌ను బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. సిగ్నేచర్ గ్లోబల్ వ్యవస్థాపకుడు ప్రదీప్ అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం.. పన్ను శ్లాబులను వీలైనంత సరళతతో రెడ్యూస్ చేయడం వల్ల డెవలపర్‌లకు GST కంప్లయన్స్ సులభతరం అవుతుంది. తద్వారా నగదు ప్రవాహం మెరుగవుతుంది. దాంతో ధరలు దిగివచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.
అయితే, ప్రతిపాదిత జీఎస్టీ తగ్గింపుల వల్ల వచ్చే పొదుపులను డెవలపర్‌లు వాస్తవంగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేస్తారా అనేది అనిశ్చిత అంశంగానే మిగిలింది. సహజ్‌మనీ యొక్క స్థాపకుడు అభిషేక్ కుమార్ దీని మాట్లాడుతూ.. చాలా సందర్భాలలో నిర్మాణ వ్యయం తగ్గినా, విక్రయదారులు ధరలను తగ్గించకపోవచ్చు. వారు లాభాలను కాపాడుకునే అవకాశం కూడా ఉందన్నారు.
ఇక ఈ పన్ను సవరణలు రియల్ ఎస్టేట్ లావాదేవీలకు పారదర్శకత తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తంమీద పన్ను భారం 10 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గితే, కొనుగోలుదారులపై ఉన్న ఆర్ధిక ఒత్తిడి తగ్గుతుంది. దీంతో బడ్జెట్ గృహాలపై డిమాండ్ పెరిగే అవకాశముంది. అలాగే, నగదు ఆధారిత లావాదేవీల సంఖ్య తగ్గి, అధికారిక మార్గాల ద్వారా లావాదేవీలు పెరిగే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏదేమైనా.. 5%, 18% రెండుస్లాబ్ జీఎస్టీ రీడిజైన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది గృహ కొనుగోలుదారులకు గట్టి ఊరటను అందించే సంస్కరణ కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications