Electricity: ఖాళీగా ఉన్న ఇళ్లను ఓయో, ఎయిర్ బీఎన్బీ వంటి సంస్థలకు లీజుకి ఇచ్చి చాలామంది హోటల్స్ గా చెలామణీ చేస్తున్నారు. ఇలా చేస్తూ భారీ మొత్తంలో ఆర్జించేవారు కూడా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఉన్న గృహాలను ఇలా వినియోగించడంపై ఇటీవల ఆందోళనలు నెలకొన్నాయి. వీటి సంగతి పక్కన పెడితే డబ్బు కోసం ఊరు,పేరు తెలియని వారికి స్టే ఇచ్చేవాళ్లు జాగ్రత్త ఉండాలని అమెరికాలో జరిగిన ఈ ఘటన హెచ్చరిస్తోంది.
సాధారణంగా ఎక్కడైనా పని ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే హోటళ్లలో దిగి అదికాస్తా పూర్తయ్యే వరకు స్టే చేస్తుంటారు. ఈ సమయంలో ఎక్కువగా బయట తిరుగుతూ, గదిలో చాలా తక్కువ సమయం మాత్రమే గడుపుతారు. దీనికిగాను సదరు హోటల్ యాజమాన్యానికి కరెంట్ బిల్లు నామమాత్రంగానే వస్తుంటుంది. అయితే ఎయిర్ బీఎన్బీలో లిస్ట్ కాబడిన నార్త్ కరోలినాలోని హోటల్ ఓనర్ కు వింత అనుభవం ఎదురైంది. అతిథులు ఇచ్చిన షాక్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింంది.

యాష్లీ క్లాస్ అనే మహిళకు సంబంధించిన ఇంటిలో ఇద్దరు వ్యక్తులు అతిథులుగా దిగారు. మూడు వారాలపాటు అక్కడే స్టే చేశారు. వారు ఖాళీ చేసిన అనంతరం వచ్చిన కరెంటు బిల్లు చూసి ఒక్కసారిగా ఆమెకు గుండె ఆగినంత పనైంది. ఏకంగా 1.25 లక్షల మేర విద్యుత్ వినియోగించినట్లు బిల్ వచ్చింది. ఇలా ఎలా జరిగిందో అర్థంకాక దాని ఓనర్ తల పట్టుకుంది. సర్వేలైన్స్ ఫుటేజ్ చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. అక్కడ స్టే చేసిన ఇద్దరు అతిథులు క్రిప్టో కరెన్సీ మైనింగ్ కు పాల్పడ్డారు. ఇందుకుగాను భారీ ఎలక్ట్రిసిటీ అవసరం కావడంతో లక్షల్లో బిల్లు వచ్చింది.
ఇది తెలుసుకున్న యాష్లీ.. బిల్లు చెల్లించాల్సిందిగా ఆ అతిథులను కోరింది. అందుకు వారు మొదట నిరాకరించడంతో ఆధారాలతో సహా ఎయిర్ బీఎన్బీని ఆశ్రయించింది. ఎట్టకేలకు విద్యుత్ బిల్లు చెల్లింపునకు వారు అంగీకరించారు. తత్వం బోధపడటంతో ఎయిర్ బీఎన్బీ లిస్టింగ్‌లో 'నో క్రిప్టో మైనింగ్' అని ట్యాగ్ చేసింది. ఈ మొత్తం తతంగాన్ని ఆమె టిక్ టాక్ లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications