For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TWitter: ట్విట్టర్ కొనుగోలు డీల్ రద్దు చేసుకున్న ఎలోన్ మస్క్.. ఎందుకంటే..

|

ట్విట్టర్ కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విటర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విటర్‌ ఉల్లంఘించిందని అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ట్విట్టర్ సీఈవో బ్రెట్ టైలర్ స్పందించారు. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చట్టపరమైన చర్యలను కొనసాగించాలని యోచిస్తోందని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో తెలిపారు.

మస్క్‌తో చేసుకున్న ఒప్పందాన్ని నిబంధనల ప్రకారం రద్దు చేయడానికి ట్విటర్‌ బోర్డు కట్టుబడి ఉందని చెప్పారు. అయితే, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం.. ఏదైనా కారణంగా మస్క్‌ ఒకవేళ లావాదేవీని పూర్తి చేయకపోతే 1 బిలియన్‌ డాలర్లను బ్రేక్‌ అప్‌ ఫీజు(పెనాల్టీ) కింద కట్టాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయడానికి మస్క్ గతంలో ఒప్పందం చేసుకున్నారు.

Twitter vows legal fight after Elon Musk pulls out of $44 bn deal

అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని గత కొంత కాలంగా స్పష్టం చేస్తూ వస్తున్నారు.ఆ విషయం తేలేవరకు కొనుగోలు ఒప్పందం ముందుకు వెళ్లదని ఎలోన్‌ మస్క్‌ చెప్పారు. ఏప్రిల్ ప్రారంభంలో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తామని ప్రకటించిన తర్వాత Twitter షేర్లు పెరిగాయి.

English summary

TWitter: ట్విట్టర్ కొనుగోలు డీల్ రద్దు చేసుకున్న ఎలోన్ మస్క్.. ఎందుకంటే.. | Twitter vows legal fight after Elon Musk pulls out of $44 bn deal

Elon Musk, the chief executive officer of Tesla and the world's richest person, said on Friday he was terminating his $44 billion deal to buy Twitter because the social media company had breached multiple provisions of the merger agreement.
Story first published: Saturday, July 9, 2022, 8:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X