ఒకప్పుడు ట్విట్టర్‌లో బ్లూ టిక్ అంటే స్టేటస్, ఇప్పుడు మాత్రం సబ్‌స్క్రిప్షన్‌కి సింబల్ అయ్యింది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ (ఇప్పటి X) రూపురేఖలే మారిపోయాయి. ఒక్కో మార్పు వినియోగదారులకు ఆశ్చర్యంగా, కొన్ని మార్పులు అభిప్రాయ భేదాలకు కారణంగా మారాయి. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం చాలామందికి ఊరట కలిగించేదిగా మారింది. పూర్తిగా డబ్బే కాదు, డిజిటల్ స్వేచ్ఛను అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో, ఇప్పుడు X సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించింది. ఎలాన్ మస్క్, భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, ఇప్పుడు బేసిక్ నుండి ప్రీమియం ప్లాన్‌ల వరకు అన్నింటిలోనూ భారీగా ధరలు తగ్గించేశారు.

కొత్తగా ప్రవేశపెట్టిన X సబ్‌స్క్రిప్షన్ ధరలు చూస్తే చాలామందికి నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. బేసిక్ ప్లాన్ నెలకు కేవలం రూ. 170కి లభిస్తోంది. ఇక ప్రీమియం ప్లాన్ వెబ్ ద్వారా తీసుకుంటే రూ. 427, మొబైల్ ద్వారా అయితే రూ. 470గా నిర్ణయించారు. ఇకపోతే ప్రీమియం ప్లస్ ప్లాన్ వెబ్ వర్షన్‌కి రూ. 2,570గా ఉండగా, మొబైల్‌లో ఇది సుమారు రూ. 3,000 వరకు ఉంది. ఎలాన్ మస్క్ భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, వినియోగదారుల మనసు గెలుచుకునే ప్రయత్నంలో డిస్కౌంట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేలా ప్లాన్‌లను సులభంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా ఇది చెబుతున్నారు.
అసలు ఎందుకు తగ్గించారు?
ఇది ఒక విధంగా వ్యూహాత్మక నిర్ణయం. భారతదేశంలో సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ప్రజలు డబ్బు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. అదే దృష్టిలో ఉంచుకొని "ధరలు తగ్గిస్తే, యూజర్లు పెరుగుతారు" అన్న లాజిక్‌తో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు. అంతేకాదు, Xలో కొత్తగా తీసుకొస్తున్న AI ఫీచర్లు, లాంగ్ ఫార్మాట్ పోస్ట్‌లు, అడ్స్ లేకుండా స్క్రోల్ చేసే అనుభవం ఇవన్నీ చాలా మందిని ఆకర్షించగలవు. కాని అందుకు ముందు అందరికీ ఇది అందుబాటులో ఉండాలి అని ఇలా వచ్చారు.
మనకు లాభం ఏమిటి?
ఈ తగ్గింపు కారణంగా ఇప్పుడు ఓ క్రియేటర్, బ్లాగర్ లేదా వ్యాపార వ్యక్తి అయినా తక్కువ ఖర్చుతో ట్విట్టర్‌ను మరింత వాణిజ్య పద్ధతిలో వాడుకోవచ్చు. ఎడిట్ ఫీచర్, ఎక్కువ పదాలు రాసే అవకాశం, వీడియోలు అప్‌లోడ్ చేసే స్కోప్, ప్రకటనలు లేకుండా అనుభవించడం వంటివి ఇవన్నీ ఇప్పుడు బడ్జెట్‌కి తగ్గ ధరలో అందుబాటులోకి వచ్చాయి. మొత్తానికి, టెక్ ప్రపంచంలో ఏదైనా "ప్రైస్ కట్" అంటే అది కస్టమర్ పక్షాన ఉండే సానుకూల సంకేతమే. ఎలాన్ మస్క్ ఇప్పుడు అదే చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications