Twitter rival:అధిక మొత్తం వెచ్చించి ట్విట్టర్ ను కొనుగోలు చేసిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు మరో తలనొప్పి మొదలైంది. ఇదే కంపెనీకి చెందిన మాజీ CEO జాక్ డోర్సే రూపొందించిన బ్లూస్కై ఇప్పుడు ట్విట్టర్ కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగింది. గత నెలలోనే iOS ఆధారిత యాప్ రిలీజ్ చేసిన సంస్థ.. ఇప్పుడు తాజాగా అండ్రాయిడ్ బీటా వెర్షన్ టెస్టింగ్ స్టార్ట్ చేసింది.
బ్లూస్కై యాప్ పబ్లిక్ గా అందుబాటులోకి రాకముందే ఇప్పుడు బీటా వెర్షన్ ప్రయత్నించాలనుకునే వారు వెయిటింగ్ లిస్టులో చేరవచ్చు. ప్రత్యామ్నాయంగా స్నేహితుల నుంచి ఇన్విటేషన్ కోడ్ ద్వారా ఇందులో పాలుపంచుకోవచ్చు. ఫిబ్రవరి 17న దీనిని ప్రారంభించగా.. ఇప్పటివరకు 2 వేల మంది బీటా టెస్టర్లు ఇందులో భాగమయ్యారు. గూగుల్ ప్లే స్టోర్ లోనూ 5 వేల కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణ ఇంటర్ ఫేస్ కలిగి ఉన్న బ్లూస్కై.. కొన్నింటిలో ట్విట్టర్ ని పోలి ఉంటుంది. ఇందులో ప్లస్ బటన్ క్లిక్ చేసి వినియోగదారులు 256 అక్షరాల పోస్ట్ ను సృష్టించవచ్చు. ట్విట్టర్ లోని 'What's happening?'కి బదులుగా బ్లూస్కైలో 'What's up?' అని అడుగుతుంది. యూజర్లు స్వంత ఫిల్టర్‌లు, లేబుళ్లను సృష్టించడానికి లేదా సోషల్ మీడియా ఫీడ్‌లను వ్యక్తిగతీకరించడానికి అవకాశం ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం థర్డ్ పార్టీ సేవలను ఉపయోగించడానికి అనుమతించాలని యోచిస్తోంది. తద్వారా వినియోగదారులు చూసే వాటిపై మరింత నియంత్రణ కలిగి ఉంటారని తెలుస్తోంది.
'మోడరేషన్ అనేది సామాజిక మాధ్యమాలకు అవసరమైన ఓ లక్షణం. దీని ద్వారా చెడు ప్రవర్తన నిర్బంధించబడుతుంది. నిబంధనలు సెట్ చేయబడతాయి మరియు వివాదాలు పరిష్కరించబడతాయి. బ్లూస్కై యాప్‌ను Invite-onlyగా మాత్రమే అందుబాటులో ఉంచాము. పూర్తిగా ప్రజల్లోకి తీసుకొచ్చేముందు వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం మోడరేషన్ పూర్తి చేస్తున్నాము' అని కంపెనీ CEO జే గ్రాబెర్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications