ట్విట్టర్‌ను మొత్తాన్ని కొనుగోలు చేస్తానని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వారం పది రోజుల క్రితం ఆఫర్ ఇచ్చారు. మొదట ఈ ప్రతిపాదనను ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. మొత్తాన్ని విక్రయించేది లేదని ట్విట్టర్ బోర్డు కూడా సంకేతాలు ఇచ్చింది. కానీ ఎలాన్ మస్క్ మాత్రం దీనిని కొనుగోలు చేయడానికి ఎప్పటికి అప్పుడు తన ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్రాన్సాక్షన్‌కు కావాల్సిన నిధులను కూడా సిద్ధం చేశారు. కొనుగోలు కోసం హోల్డింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించారు.
ఓ వైపు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలుకు ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో ట్విట్టర్ కూడా ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. మస్క్ డీల్‌కు అంగీకారం తెలపనప్పటికీ, ఆయన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నదని తెలుస్తోంది. ఆదివారం షేర్ హోల్డర్లు కూడా మంచి ఆఫర్ వస్తుండటంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ట్విట్టర్ బోర్డు ఆదివారం సమావేశమై, మస్క్ ఆకర్షణీయ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోందట.

మస్క్ ఒక్కో ట్విట్టర్ షేర్‍కు 54.20 డాలర్లు డాలర్ల చొప్పున 43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆన వివిధ బ్యాంకుల ద్వారా 46 బిలియన్ డాలర్ల రుణాన్ని సిద్ధం చేశారు. ట్విట్టర్ బోర్డుతో సంబంధం లేకుండా టెండర్ ఆఫర్ ద్వారా ఆయన నేరుగా వాటాదారులతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం పలువురితో వీడియో కాల్ ద్వారా మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. ట్విట్టర్ ఎదుగుదలకు వాక్ స్వేచ్ఛపై నియంత్రణలు ప్రతిబంధకంగా మారాయని, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సమాచారం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications