twitter: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏమి చేసినా ఓ సంచలనమే. అంతగా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత నుంచీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఖర్చులను తగ్గించుకుంటూ, ఆదాయాన్ని పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ కోవలోనే బ్లూ టిక్ ను ప్రవేశపెట్టారు. తాజాగా గోల్డ్ చెక్ గురించిన సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నెలకు వెయ్యి డాలర్లు:
వెరిఫైడ్ గోల్డ్ చెక్ మార్కు కోసం కంపెనీల నుంచి నెలకు వెయ్యి డాలర్లు(భారతీయ కరెన్సీలో దాదాపు 80 వేల రూపాయలు)ను ట్విట్టర్ వసూలు చేయనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మేరకు కొన్ని అంతర్గత మెయిల్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా కన్సల్టెంట్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఒక ఇమెయిల్‌లో.. 'వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్' ప్లాన్ కోసం 1000 డాలర్లు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నెలవారీ అదనంగా మరో 50 డాలర్లు రుసుముతో అదనపు అనుబంధ హ్యాండిల్స్ ను అందించనున్నట్లు అందులో తెలిపారు.

స్పందన కోసం వెయిటింగ్:
ఈ వార్తలపై ట్విట్టర్ లేదా దాని CEO ఎలాన్ మస్క్ కానీ ఇంకా స్పందించలేదు. 2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి పలు ఆదాయ మార్గాలను మస్క్ అన్వేషిస్తూనే ఉన్నారు. ట్విట్టర్ API యాక్సెస్, ధృవీకరించబడిన బ్లూ టిక్, యూడర్ ఎక్స్ పీరియన్స్ మానిటైజేషన్ వంటి వాటిని ప్రవేశపెట్టారు.

ఇప్పటికి కష్టాల్లోనే..
అయితే ఇప్పటికీ ట్విట్టర్ ప్రమాదకర స్థితిలోనే ఉందని మస్క్ స్వయంగా అంగీకరించారు. ట్విట్టర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుతోందన్న వార్తలపై ఆయన స్పందించారు. అక్కడికి చేరుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉందన్నారు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో కోలుకోలేదు కానీ ట్రెండింగ్ లో ఉందని తెలిపారు. ట్విట్టర్ బ్లూకు సబ్ స్క్రైబ్ అయిన క్రియేటర్‌లతో యాడ్ ఆదాయాన్ని పంచుకుంటామని ఆయన చెప్పిన కొద్దిసేపటికే ఈ వార్త బయటకు రావడం విశేషం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications