Twitter: ఎలాన్ మస్క్ చేతికొచ్చిన తరువాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో పెను మార్పులు జరిగిన విషయం తెలిసిందే. యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం అందులో ఒకటి. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్‌కు ఆదాయాన్ని షేర్ చేయనున్నట్లు సంస్థ అధినేత మస్క్ గతంలో ప్రకటించారు. కాగా క్రియేటర్స్ ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఫలాలు అందుకుంటున్నారు.
ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన క్రియేటర్స్ అధిక మొత్తంలో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. రచయిత బ్రియాన్ క్రాస్సెన్‌స్టెయిన్‌కు 7.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా 18.23 లక్షలు, 1.7 మిలియన్ల ఫాలోయింగ్ కలిగిన రాజకీయ వ్యాఖ్యాత బెన్నీ జాన్సన్ 7.16 లక్షలు సంపాదించారు. ఈ మొత్తాన్ని స్ట్రైప్ ద్వారా ట్విట్టర్ పేమెంట్ చేయనుంది.

ఈ యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రాంకు అందరూ అర్హలు కారు. అకౌంట్ మానిటైజేషన్ కావాలంటే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉండటం తప్పనిసరి. ప్రతినెలా 5 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్ ఇంప్రెషన్లు చొప్పున 3 నెలలపాటు పొందిన కంటెంట్ క్రియేటర్స్ ఇందుకు అర్హులు.
ట్విట్టర్ కంటెంట్ మోనిటైజేషన్ ప్రమాణాలను క్రియేటర్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లైంగిక, పిరమిడ్ స్కీమ్స్, తక్కువ కాలంలో ధనవంతులయ్యే పథకాలు, హింస, నేరాలు, జూదం, మాదకద్రవ్యాలు వంటి విభాగాలపై నిషేధం ఉంది. ఫిబ్రవరిలో ఈ ప్రోగ్రాం గురించి మస్క్ ప్రకటించారు. మొదటి విడతలో 37.5 కోట్ల యాడ్ రెవెన్యూని క్రియేటర్స్‌కు షేర్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా అదిప్పుడు అమలవుతోంది.


Click it and Unblock the Notifications