Twitter careers: ఈ కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: అర్హతలివే: అర్జెంట్ రిక్వైర్‌మెంట్

న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్..తన వైఖరిని మార్చుకుంది.. మెట్టు దిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు లోబడి పనిచేయడానికి అంగీకరించింది. ఈ దిశగా కసరత్తు కూడా మొదలు పెట్టింది. ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత అకౌంట్‌కు సంబంధించిన బ్లూ టిక్‌ను తొలగించిన నేపథ్యంలో.. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి తుది నోటీసులను అందుకున్న తరువాత ట్విట్టర్ యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలకు దిగింది.

వాటికి భిన్నంగా..

వాటికి భిన్నంగా..

దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలన్నీ కిందటి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్‌బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ మాత్రం విభేదించింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించడానికి మొండికేసింది. యధాతథంగా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగిస్తోంది.

తుది నోటీసుతో మెట్టు దిగిన ట్విట్టర్..

తుది నోటీసుతో మెట్టు దిగిన ట్విట్టర్..

ఈ నేపథ్యంలో- కొత్త మార్గదర్శకాలను అనుసరించడంపై ఆ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద చివరి అవకాశాన్ని ఇస్తోన్నామని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం- ట్విట్టర్ యాజమాన్యం భారత్‌లో ఒక చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, ఒక నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని వేర్వేరుగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇటాంటి చర్యలేవీ ట్విట్టర్ యాజమాన్యం చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం తాఖీదులను జారీ చేయడంతో మెట్టు దిగింది.

అర్హతలు ఇవే..

అర్హతలు ఇవే..

భారత్‌లో చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, నోడల్ అధికారి, గ్రీవెన్స్ అధికారిని ఒక్కొక్కరు చొప్పున నియమించడానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీన్ని లింక్డ్‌ఇన్‌ (Linkedin)లో పోస్ట్ చేసింది. ఈ రంగంలో అనుభవం ఉన్న ఆసక్తిగల వారు సంప్రదించాలని సూచించింది. ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. భారత్‌ వరకు గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం విభాగం బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికా కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, హెడ్ క్వార్టర్స్‌లోని లీగల్ సెక్షన్‌లో ఓ భాగంగా ఈ పోస్టులను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.

ఆ పోస్టుకు 15 సంవత్సరాల అనుభవం..

ఆ పోస్టుకు 15 సంవత్సరాల అనుభవం..

నోడల్ అధికారి పోస్ట్ దీనికి కొంత భిన్నంగా ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. న్యాయ విభాగాలు, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఈ పోస్ట్‌పై ఉందని వెల్లడించింది. ఈ విభాగంలో కనీసం ఆరు సంవత్సరాల పాటు అనుభవం ఉండాలని, ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేయదలిచిన వారు తప్పనిసరిగా భారత్‌లో నివసించాల్సి ఉంటుందనే షరతులు పెట్టింది. 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారు చీఫ్ కంప్లయన్స్ అధికారి పోస్ట్‌ కోసం దరఖాస్తు చేయాలని ట్విట్టర్ పేర్కొంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్స్‌లోని లీగల్ సెక్షన్‌తో ఎఫ్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

h

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+