For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter: పేరుకి సోషల్ మీడియా దిగ్గజం.. అద్దెలు చెల్లింపునకూ ఆపసోపాలు

|

Twitter: 'ఎలాన్ మస్క్' ఒక పేరు అనడం కంటే ఫైర్ బ్రాండ్ అనడం బెటరేమో ! ఆయన ఏది చేసినా సంచలనమే.. దాని చుట్టూ వివాదాలేనని నెట్టింట అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అవరోధాలను అధిగమించి ట్విట్టర్ ను కొనుగోలు చేయడం దగ్గర నుంచి.. ఆయన మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. ఖర్చులు తగ్గింపుల్లో భాగంగా దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించడంతో ఆయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం అద్దెను 2 నెలలుగా చెల్లించడం లేదంటూ.. సదరు భవనం యజమాని ప్రస్తుతం ఆయనను కోర్టుకు ఈడ్చారు.

 రెండు నెలలుగా...

రెండు నెలలుగా...

రెండు నెలల నుంచి అద్దె చెల్లింపుల్లో ట్విట్టర్ విఫలమైందని.. కాలిఫోర్నియాలోని స్టేట్ కోర్టు కోర్టులో భవనం యజమాని సోమవారం దావా వేశారు. డిసెంబరులో 3.36, జనవరిలో 3.42 మిలియన్ డాలర్ల అద్దె రావాల్సి ఉందని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ తన దావాలో పేర్కొంది. 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని మొత్తం 8 అంతస్తుల్లో ట్విట్టర్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 4 లక్షల 60 వేల చదరపు అడుగులు స్థలాన్ని భవనం యజమాని నుంచి అద్దెకు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

 ఏమిటీ వివాదం:

ఏమిటీ వివాదం:

"3.6 మిలియన్ డాలర్ల వరకు మాకు క్రెడిట్ లైన్ ఉంది. ఒకవేళ ట్విట్టర్ నియంత్రణలో బదిలీ జరిగితే దానిని 10 మిలియన్ డాలర్లకు పెంచాల్సి ఉంది. ఎలాన్‌ మస్క్ అక్టోబర్‌ లో ట్విట్టర్ ను కొనుగోలు చేశారు కాబట్టి ఈ ఒప్పదం అమలు చేయాలి. లీజు నిబంధనలను ఆ సంస్థ ఉల్లంఘిస్తోంది" అని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ సెక్యూరిటీ పేర్కొంది. కానీ పెంచాల్సిన అవసరం లేదని ట్విట్టర్ వాదించింది. కోర్టు నుంచి తీర్పు వెలువడాల్సి ఉంది.

అప్పటి నుంచి ఇబ్బందులే:

అప్పటి నుంచి ఇబ్బందులే:

అక్టోబర్‌ లో 44 మిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఖర్చులను తగ్గించుకోవడంపై ఆయన దృష్టిపెట్టారు. అందులో భాగంగా.. సగం మంది సిబ్బందిని తొలగించారు. ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ కార్యాలయాలకు అద్దె చెల్లింపులను నిలిపివేశారు. ట్విట్టర్ కొనుగోలు సమయంలో తీసుకున్న 12.5 బిలియన్ డాలర్ల అప్పులో మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉండటంతో ఈ తరహా చర్యలకు దిగుతున్నట్లు భావిస్తున్నారు.

English summary

Twitter: పేరుకి సోషల్ మీడియా దిగ్గజం.. అద్దెలు చెల్లింపునకూ ఆపసోపాలు | Twitter failed to pay office rent since two months

Twitter struggles to pay office rent
Story first published: Tuesday, January 24, 2023, 21:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X