Twitter: ఎలాన్ మస్క్ దెబ్బకు ఆఫీస్‍లోనే నిద్రపోతున్న ఉద్యోగులు..
ట్విట్టర్ ను చేజెక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మస్క నిర్ణయంతో ఉద్యోగులకు చుక్కలు కనబడుతున్నాయి. మస్క్ నిర్దేశించిన కఠినమైన లక్ష్యాలను చేరుకోవడానికి ఓవర్‌టైమ్‌ను చేస్తున్నారు. ఇంటికి వెళ్లేందుకు టైమ్ లేక కార్యాలయంలో నేలపై నిద్రిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్ ఉద్యోగి షేర్ చేశారు. మస్క్ $44 బిలియన్ల ఒప్పందంలో సోషల్ మీడియా కంపెనీని కొనుగోలు చేశారు.
ఎస్తేర్ క్రాఫోర్డ్
ట్విట్టర్ స్పేస్‌ల కోసం ప్రొడక్ట్ మేనేజర్ అయిన ఇవాన్ జోన్స్ ఆఫీసు ఫ్లోర్‌లో ఓ ఉద్యోగి గాఢ నిద్రలో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఎస్తేర్ క్రాఫోర్డ్ స్లీపింగ్ నిద్రపోతున్నట్లు ఫొటోలో కనిపిస్తుంది. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారో స్పష్టంగా తెలియలేదు. జోన్స్ ట్విటర్ ప్రోఫైల్ ప్రకారం అతను న్యూయార్క్‌లో ఉన్నాడని, క్రాఫోర్డ్ ఆమె లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారని తెలుస్తుంది.

బిజినెస్ ఇన్‌సైడర్
బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం ప్రధాన ప్రాజెక్ట్‌లపై మస్క్ కఠినమైన టార్గెట్లను విధించినందున ట్విట్టర్‌లోని ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుందట. Twitter కొత్త వెరిఫికేషన్ సిస్టమ్‌లో పని చేస్తున్న బృందం - గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మస్క్ దూకుడు లక్ష్యాలను చేరుకోవడానికి ట్విట్టర్‌లోని నిర్వాహకులు వారానికి ఏడు రోజులు 12 గంటల షిఫ్టులలో పని చేయాలని సూచించారని CNBC పేర్కొంది. ఓవర్ టైం వేతనం, కాంపెన్సేటరీ టైమ్ ఆఫ్ లేదా ఉద్యోగ భద్రతపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు నివేదిక వివరించింది.


Click it and Unblock the Notifications