Twitter: ఎలాన్ మస్క్ ను మస్త్ పరేషాన్ చేస్తున్న ట్విట్టర్.. వారిపైనా లీగల్ చర్యలు.. తలలు పట్టుకుంటూ..
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేస్తానంటూ చివరి వరకు ఊరించి ఉసూరుమనిపించారు. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ కు బుద్ది చెప్పేందుకు కంకణం కట్టుకున్న ట్విట్టర్ మేనేజ్ మెంట్ ఆయనతో పాటు మస్క్ మిత్రులను సైతం చిక్కుల్లోకి లాగుతోంది. అసలు ఈ విషయంలో ఏమి జరుగుతుందంటే..

కొత్తగా నోటీసులు జారీ..
బిలియనీర్ ఎలాన్ మస్క్ స్నేహితులకు ట్విట్టర్ కోర్టు నోటీసులు పంపింది. దీని ప్రకారం వారు మస్క్ చేసిన తప్పుకు కోర్టులో జవాబు చెప్పేందుకు హాజరు కావాలని subpoenas జారీ చేసింది. దీని ద్వారా ఎలాన్ మస్క్ కంపెనీని కొనుగోలు చేసేలా చేసేందుకు తాజాగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం ఎలాన్ మస్క్ స్నేహితులను ఇరుకున పెడుతోంది.

చట్టపరమైన చర్యలు..
ఇన్వెస్టర్లు చమత్ పలిహపిటియా, మార్క్ ఆండ్రీసెన్, స్టీవ్ జుర్వెట్‌సన్, జాసన్ కాలకానిస్, కీత్ రాబోయిస్, జో లాన్స్‌డేల్‌లకు ట్విట్టర్ చట్టపరమైన అభ్యర్థనలను పంపింది. ఈ వివరాలను వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. న్యాయపరమైన అభ్యర్థనల ఫలితంగా.. అక్టోబర్‌లో ఐదు రోజుల విచారణ సమయంలో వీరు కోర్టులో సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది.
భయపడ్డ మస్క్..!
స్పామ్, బాట్‌ల గురించి మస్క్ ఆందోళన చెందారు. పైగా మే నెలలో ఆల్-ఇన్ సమ్మిట్‌లో వీటికి సంబంధించిన సమాచారం అందించాలని ట్విట్టర్ ను కోరాడు. అయితే జూలైలో జరిగిన మియామి ఈవెంట్‌లో.. 44 బిలియన్ డాలర్ల ఒప్పందం నుంచి తప్పుకోవటానికి వారాల ముందు, ఒప్పందం గురించి తన భయాన్ని వ్యక్తం చేశాడు.

ఎలాన్ మస్క్ స్నేహితులు..
కస్తూరి కాలకానిస్, సాక్స్‌తో స్నేహంగా ఉంటాడు మస్క్. సాక్స్ అండ్ మస్క్ ఇద్దరూ స్నేహితుడైన బిలియనీర్ పీటర్ థీల్‌తో కలిసి PayPalలో కలిసి పనిచేశారు. రాబోయిస్ కూడా పేపాల్ ఎగ్జిక్యూటివ్, థీల్‌తో స్నేహితులు. జుర్వెట్సన్ మస్క్ కు చిరకాల స్నేహితుడు, టెస్లా బోర్డు సభ్యుడు. ట్విట్టర్ వేధింపు ప్రారంభించిందని ఎలాన్ మస్క్ స్నేహితుడు లాన్స్‌డేల్ తన ట్వీట్ లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications