Bluesky: ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఆ ఆనందం రోజులు గడవక ముందే ఆవిరైపోతోంది. ఆయనకు సరైన పోటీ ఇచ్చే మెునగాళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడే మస్క్ కు పోటీదారుగా నిలవటం హీట్ పుట్టిస్తోంది.
సరికొత్త సోషల్ నెట్‌వర్క్..
ట్విట్టర్ ను వీడిన మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నారు. బ్లూస్కై పేరుతో దానిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. దీనిని బ్లాక్ చెయిన టెక్నాలజీ ఆధారంగా తయారు చేసినట్లు వెల్లడించారు. ఇదొక డీసెంట్రలైజ్డ్ సోషల్ నెట్ వర్క్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది బీటా టెస్టింగ్ స్థితిలో ఉందని, త్వరలోనే Bluesky ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

నయా సాంకేతకత..
కొత్తగా వస్తున్న ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వినియోగించే "AT Protocol" సాంకేతికత పెద్ద బలం అని తెలుస్తోంది. ఇది వినియోగదారులను ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లేందుకు దోహదపడుతుందని జాక్ డోర్సే తెలిపారు. ఇది గట్టిపోటీని ఇస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.

2019లో ప్రాజెక్ట్..
ట్విట్టర్ 2019లో డోర్సే నాయకత్వంలో బ్లూస్కైపై పనిచేయడం ప్రారంభమైంది. వికేంద్రీకృత సోషల్ నెట్‌వర్క్ ప్రోటోకాల్‌ను రూపొందించడం, వివిధ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లు కలిసి పనిచేయడానికి వీలు కల్పించడమే దీని లక్ష్యంగా ఉంది. ఇది సపరేట్ సంస్థగా ఏర్పాటు చేయబడినప్పటికీ.. నిధుల కోసం ఇప్పటికీ ట్విట్టర్ పై ఆధారపడి ఉందని తెలుస్తోంది. అలా ఇప్పటి వరకు మెుత్తం 13 మిలియన్ డాలర్లను ఈ ప్రాజెక్ట్ అందుకుంది. మస్క్ దీనికి నిధులు ఆపేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నెజిజన్ల రియాక్షన్..
Jack Dorsey ట్విట్టర్ వేధికగా తన ప్లాన్ గురించి వెల్లడించటంతో చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని, తాము ఇందులో జాయిన్ అవుతామని వారు కామెంట్స్ చేయటం ట్విట్టర్ కు గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications