Twitter: ట్విట్టర్ కంపెనీని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అంతా అల్లకల్లోలం జరుగుతోంది. ఇంతకు ముందు అమెరికాలో ఆఫీసుల్లోని ఫర్నిచర్ అమ్మటం, ఆఫీసులకు అద్దె చెల్లించకపోటం, ఉద్యోగులను భారీగా తొలగించటం వంటి నిర్ణయాలతో ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు.
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి వెనుక అసలు కారణం ఖర్చులను తగ్గించుకోవటం అని తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే ఫార్ములాను ఇండియాలోనూ అమలు చేస్తున్నాడు బిలియనీర్ మస్క్. తాజాగా ఇండియాలో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి ముంబై, ఢిల్లీలో ఉన్న రెండు ఆఫీసులు ఇక మూతపడనున్నాయి. ఈ కార్యాలయాల్లో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ట్విట్టర్ కంపెనీకి ఇండియాలో తొలగింపుల తర్వాత తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అందుకే ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా రెండు కార్యాలయాలను మస్క్ మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను ఇకపై ఇంటి వద్ద నుంచే పనిచేయాలని ట్విట్టర్ సూచించింది.
ట్విట్టర్ కు బెంగళూరులో ఉన్న కార్యాలయం మాత్రం కొనసాగనుందని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే ఇంజనీర్లు నేరుగా US కార్యాలయానికి నేరుగా రిపోర్ట్ చేస్తారు. 44 బిలియన్ డాలర్లకు కంపెనీని మస్క్ కొనుగోలు చేసిన తర్వాత వారాల వ్యవధిలోనే దాదాపు 7500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications