For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విట్టర్ డీల్ నిలిపివేతపై సీఈవో పరాగ్ అగర్వాల్ కీలక వ్యాఖ్య

|

ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ప్రణాళికని తాత్కాలికంగా నిలిపివేసినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించగా, దీనిపై సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. ఈ డీల్ కచ్చితంగా పూర్తవుతుందని, తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇతర ఊహించని పరిణామాలకు తాము సన్నద్ధంగా ఉండవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ డీల్ మధ్యలో ఆగిపోతే తాము అన్నింటికి సిద్ధంగా ఉండాల్సిన అవసరముందన్నారు.

ఒకవేళ డీల్ మధ్యలో ఆగిపోయినా తాము అన్నింటికి సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ట్విట్టర్‌లో ఇద్దరు ఉన్నతాధికారులను పరాగ్ ఇటీవల తొలగించారు. మరోవైపు కొత్త నియామకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా కంపెనీ యాజమాన్యం మారుతున్నప్పుడు ఇంకా వ్యయ నియంత్రణ చర్యలు ఎందుకని కొంతమంది తనను ప్రశ్నించినట్లు చెప్పారు.

Twitter CEO Parag Agrawal says expect more changes hours after firing top officials

ఈ పరిశ్రమ ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటుందని, డీల్‌ను అడ్డం పెట్టుకొని కీలక నిర్ణయాలను తీసుకోకుండా ఉండలేమని, తానే కాదని, ట్విట్టర్ బాగు కోసం సంస్థలోని ఇతర నాయకులు ఎవరు అలాంటి ఆలోచన చేయబోరన్నారు.

English summary

ట్విట్టర్ డీల్ నిలిపివేతపై సీఈవో పరాగ్ అగర్వాల్ కీలక వ్యాఖ్య | Twitter CEO Parag Agrawal says expect more changes hours after firing top officials

Twitter CEO Parag Agrawal on Saturday defended his decision to fire two top executives at the social media giant in a series of tweets saying hard decisions were needed.
Story first published: Saturday, May 14, 2022, 13:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X