Twitter: ఎలాన్ మస్క్ తో పోరాటానికి సిద్ధమైన ఆ ముగ్గరు.. 100 మిలియన్ డాలర్లే టార్గెట్..!
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ముఖ్యంగా కంపెనీలలో కీలకంగా ఉన్న ముగ్గురు అధికారులను మస్క్ తప్పించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె, CFO నెడ్ సెగల్ ను మస్క్ తొలగించారు. ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో వెనక్కి తగ్గిన మస్క్ ను.. కోర్టుకు లాగడంలో ఈ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. దీంతో మస్క్ వీరిని తొలగించారు. తొలగింపుపై ఈ ముగ్గురు మస్క్ తో న్యాయ పోరాటం చేయనున్నారు.
$100 మిలియన్లకు పైగా
మస్క్ అంటే ట్విట్టర్ నుంచి దాదాపు $100 మిలియన్లకు పైగా వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లోకి వచ్చారు. అతను ఉద్యోగంలో చేరే సమయంలో సంవత్సరం లోపు ఉద్యోగం నుంచి తొలగిస్తే $50మిలియన్ డాలర్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నాడు. అతను గతేడాది నవంబర్ లో ట్విట్టర్ లో చేరారు. అతడిని మస్క్ తొలగించడంతో పరాగ్ కు 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. అలాగే CFO నెడ్ సెగల్ సుమారు $35మిలియన్లు, విజయ గద్దెకు $15 మిలియన్లకు చెల్లించాల్సి ఉంటుంది.

ట్రేడింగ్ రద్దు
పెద్ద పబ్లిక్ కంపెనీలలోని అనేక మంది అగ్ర ఉద్యోగుల మాదిరిగానే, అగర్వాల్, అతని లెఫ్టినెంట్లు ఒక సంవత్సరం జీతంతో సమానమైన డబ్బును పొందేందుకు అర్హులు. కంపెనీ నిబంధనల ప్రకారం Twitter కొనుగోలు తర్వాత వారు తమ ఉద్యోగాలను కోల్పోతే, అన్‌వెస్టెడ్ ఈక్విటీ అవార్డుల క్యాష్-అవుట్‌లను పొందవచ్చు. కాగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. ట్విటర్ షేర్ల ట్రేడింగ్‌ను శుక్రవారం నుంచి రద్దు చేస్తారట.


Click it and Unblock the Notifications