Elon Musk-Tim Cook: ట్విట్టక్ ఆపిల్ వివాదంపై చర్చ.. చివరికి ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..?

Elon Musk-Tim Cook: ఎవరు ఏమనుకున్నా పర్లేదు తన మనస్సులో ఉన్నదిఉన్నట్లుగా చెప్పే టైప్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఉన్న మస్క్ ఇటీవల ఆపిల్ కంపెనీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పోటీగా ఫోన్లను తయారు చేస్తానంటూ హెచ్చరించటం మనం చూశాం. అయితే దీనికి పరిష్కారం కోసం మస్క్, టిమ్ కుక్ కలవటం పెద్ద చర్చకు దారితీసింది.

ఆపిల్ పై ఆరోపణలు..

ఆపిల్ పై ఆరోపణలు..

ఈ వారం ప్రారంభంలో ప్రపంచంలో ట్విట్టర్ కొత్త అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎలాంటి కారణం లేకుండానే ఆపిల్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను బ్లాక్ చేస్తామని బెదిరించిందని చెప్పుకొచ్చారు. పైగా ట్విట్టర్ లో ఆపిల్ ప్రకటనలను నిలిపివేసిందంటూ మస్క్ ట్వీట్ చేశారు. ప్రకటనల కోసం ఆపిల్ దాదాపు 100 మిలియన్ డాలర్లను వెచ్చించేదని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఎలాన్ మస్క్ ప్రత్యక్షంగా కలుసుకున్నారు.

టిమ్ కుక్‌తో తో మాటలు..

తాను ఆపిల్ సీఈవో కుక్‌తో సమావేశమైనట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని మస్క్ చెప్పారు. ఇతర విషయాలతో పాటు ఆపిల్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగించవచ్చనే విషంలోని అపార్థం గురించి వారు చర్చించినట్లు దానిని పరిష్కరించుకున్నట్లు స్పష్టం చేశారు.ఆపిల్ ట్విట్టర్ విషయంలో ఎప్పడూ అలా భావించలేదని టిమ్ తెలిపినట్లు మస్క్ వెల్లడించారు. గతంలో ఆపిల్ కు వ్యతిరేకంగా చేసిన ఒక పోస్టును సైతం ఎలాన్ మస్క్ ఈ సందర్భంగా తొలగించారు.

ఆపిల్ హెడ్ క్వార్టర్స్..

ఆపిల్ హెడ్ క్వార్టర్స్..

యాప్ స్టోర్ విధానాలు, పన్ను నిబంధనల కోసం ఆపిల్, కంపెనీ సీఈఓపై మస్క్ విరుచుకుపడ్డారు. కంటెంట్ మోడరేషన్ డిమాండ్లపై ఆపిల్ ప్లాట్‌ఫారమ్‌పై ఒత్తిడి తెస్తోందని ట్విట్టర్ బాస్ ఆరోపించారు. ఎలాన్ మస్క్ తో టిమ్ కలయికపై ఆపిల్ కంపెనీ ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ఆపిల్ ప్రధాన కార్యాలయంలో కుక్ ను కలిసినట్లు ఎలాన్ మస్క్ ట్విట్ల ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను సైతం పోస్ట్ చేశారు.

గతంలోనూ బెదిరింపులు..

గతంలోనూ బెదిరింపులు..

ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తామనటం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం US కాపిటల్ బిల్డింగ్ అల్లర్ల తరువాత ట్విట్టర్ ప్రత్యామ్నాయాన్ని తొలగించింది. కంపెనీ కంటెంట్, మోడరేషన్ పద్ధతులను అప్‌డేట్ చేసిన తర్వాత పార్లర్ యాప్ మే 2021లో మళ్లీ పునరుద్ధరించబడింది. అయితే ప్రస్తుతం ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ Twitter 2.0ని నిర్మిస్తున్నారు. వేగంతో పాటు మరింత పారదర్శకతే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మస్క్ ఇప్పటికే తెలిపారు. అందుకే నకిలీ ఖాతాల ఏరివేతను చేపడుతోంది. దీనివల్ల ఫాలోవర్స్ సంఖ్య తగ్గవచ్చని ఇటీవల ట్విట్టర్ వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+