Twitter: ట్విట్టర్ తన ఎడిట్ ట్వీట్ ఫీచర్‌కు మరో కొత్త హంగును జోడించింది. బ్లూ చందాదారులు తమ ట్వీట్‌లను ప్రచురించిన తర్వాత గంట వరకు సవరించడానికి అనుమతిస్తుంది. దీనిని నిర్ధారిస్తూ ట్విట్టర్ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో ఈ ఫీచర్ ప్రవేశపెట్టబడింది. దీని వినియోగదారులు తమ ట్వీట్‌లను ప్రచురించిన క్షణం నుంచి నిర్దిష్ఠ సమయ వ్యవధిలో మార్పులు చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ప్రారంభంలో ఈ విండో 30 నిమిషాలకు సెట్ చేయబడింది కానీ ఇటీవలి ప్రకటనతో ఒక గంట కాలపరిమితికి పొడిగించబడింది. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ ఈ సేవ లభిస్తోంది. నెలవారీ 900 రుసుముతో వినియోగదారులకు మెరుగైన ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ అదనపు పెర్క్‌లలో ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, లోపాలను సరిదిద్దడం లేదా పోస్ట్‌లకు మెరుగులు దిద్దడం వంటి సౌలభ్యాన్ని అందిస్తుంది.

ఈ ఫీచర్‌ని ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యేకంగా ఉంచాలనే నిర్ణయం.. ఎక్కువ మంది ప్రీమియం సేవను ఎంచుకోవడానికి ఒక వ్యూహంగా భావించవచ్చు. ఇతర ప్రయోజనాలను చూస్తే ఫీడ్‌లలో దాదాపు 50% తక్కువ ప్రకటనలు, సెర్చింగ్ మరియు సంభాషణలలో ప్రాధాన్యత కలిగిన ర్యాంకింగ్, సుదీర్ఘమైన ట్వీట్‌లను పోస్ట్ చేయగల సామర్థ్యం, సుదీర్ఘమైన వీడియో అప్‌లోడ్, ట్వీట్‌లను రద్దు చేయడం మరియు మరిన్ని ఉన్నాయి.
కంపెనీ ఇటీవల తన కొత్త CEOగా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత, ఎడిట్ ట్వీట్ కోసం సమయ పరిమితిని పొడిగించాల్సి వచ్చింది. గతంలో ఆమె NBCUniversalలో గ్లోబల్ అడ్వర్టైజింగ్ మరియు పార్టనర్‌షిప్‌ల ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రొడక్ట్ డిజైనింగ్ మరియు కొత్త సాంకేతికతను పర్యవేక్షిస్తూనే ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారిస్తారని మస్క్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications