న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. వైఖరికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత అకౌంట్‌కు సంబంధించిన బ్లూ టిక్‌ను తొలగించిన నేపథ్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. వెంకయ్య నాయుడు అకౌంట్‌కు సంబంధించిన బ్లూ టిక్‌ను ట్విట్టర్ పునరుద్ధరించినప్పటికీ.. కేంద్రం మాత్రం వెనకడుగు వేయలేదు.
దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలన్నీ కిందటి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్‌బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ మాత్రం విభేదించింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించడానికి మొండికేస్తోంది. యధాతథంగా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలో- కొత్త మార్గదర్శకాలను అనుసరించడంపై సమాచార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద ట్విట్టర్ యాజమాన్యానికి చివరి అవకాశాన్ని ఇస్తోన్నామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రిత్వ శాఖ నోటీసులను జారీ చేసింది. ఈ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్ యాజమాన్యం భారత్‌లో ఒక చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, ఒక నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇటాంటి చర్యలేవీ ట్విట్టర్ యాజమాన్యం చేపట్టలేదు.
ఈ వ్యవహారం మొత్తాన్నీ సమీక్షించడానికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సారథ్యంలో ఇదివరకే ఏర్పాటైన ప్యానెల్ శుక్రవారమే సమావేశమైంది. కమ్యూనికేషన్లు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దీనికి అనుగుణంగా ఆ మరుసటి రోజే ట్విట్టర్ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం తాఖీదులను జారీ చేసింది. ఐటీ చట్టం (ఇంటర్మీడియట్లీ గైడ్‌లైన్సెస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021కు లోబడి ఉండేలా అంగీకరిస్తారా? లేదా అనేది స్పష్టం చేయాలని ఆదేశించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications