Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. ట్విట్టర్ కొనుగోలు తర్వాత కంపెనీలో పలుమార్పులకు శ్రీకారం చుట్టారు. మొదటగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ, ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. ఇటీవల దాన్ని కాస్త X గా రీబ్రాండింగ్ చేశారు. ఇప్పుడు తన కంపెనీలోని పాత గుర్తులను సైతం చెరిపివేసే పనిలో ఉన్నారు.
ట్విట్టర్ బిల్డింగ్ కు సంబంధించిన పలు వస్తువులు, గుర్తులను వేలానికి సిద్ధంగా ఉంచారు. పదుల కొద్దీ డస్కులు, కుర్చీలు సహా ఇతర సామాగ్రి ఈ లిస్టులో ఉన్నాయి. గతంలో ట్విట్టర్లో వైరల్ గా మారిన 2 ఆయిల్ పెయింటింగ్స్ కూడా ఈ వేలంలో లిస్ట్ కాబడ్డాయి. 2014 అకాడమీ అవార్డ్స్ లో తీసిన ఎల్లెన్ డిజెనెరెస్ స్టార్-స్టడెడ్ సెల్ఫీ ఒకటి కాగా.. నవంబర్ 2012లో బరాక్ ఒబామా తిరిగి ఎన్నికైనప్పుడు పోస్ట్ మరొకటి.

ఇవి కాక గిటార్స్, డ్రం కిట్స్, ఆంప్లిఫైయర్స్, కంట్రోలర్ మరియు మిక్సర్ స్పీకర్స్ తో కూడిన డీజే బూత్ కూడా వేలానికి లిస్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 12న వీటి కోసం బిడ్డింగ్ ప్రారంభం కానుండగా.. రెండు రోజుల తర్వాత ఈ తతంగం ముగుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా తన సాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్స్ నుంచి ట్విట్టర్ పలు వస్తువులను వేలం వేసింది. ఐకానిక్ ట్విట్టర్ బర్డ్ బొమ్మ అత్యధికంగా లక్ష డాలర్లకు అమ్ముడైంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications