పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక ఆర్థిక, ఇంధన, ఉపాధి సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా భావిస్తున్న బీమా రంగం, అణుశక్తి రంగం, ఉపాధి హామీ పథకం, పాత చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులు వరుసగా ఆమోదం పొందాయి.
దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) 100 శాతం వరకు అనుమతిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన సబ్‌కా బీమా సబ్‌కా రక్షా (బీమా చట్టాల సవరణ) బిల్లు-2025'కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా.. ఈ బిల్లు ద్వారా ఆ పరిమితిని పూర్తిగా తొలగించనున్నారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షం సూచించిన సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. బిల్లును మరింత సమగ్రంగా పరిశీలించేందుకు పార్లమెంటరీ కమిటీకి పంపాలని విపక్షాలు కోరినప్పటికీ, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు.

బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ప్రజలకు మేలు చేకూరేలా బీమా రంగంలో మరిన్ని సంస్కరణలు రాబోతున్నాయని తెలిపారు. విదేశీ కంపెనీల పెట్టుబడులతో ఈ రంగం మరింత విస్తరిస్తుందని, తక్కువ ప్రీమియంతో చౌకైన పాలసీలు అందుబాటులోకి వస్తాయని ఆమె చెప్పారు. పోటీ పెరగడం వల్ల కొత్త ఉత్పత్తులు, వినూత్న పాలసీలు రావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు.
దీంతో పాటుగా అణుశక్తి రంగంలో చారిత్రక మార్పుకు బాటలు వేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతి) బిల్లును లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి పూర్తిస్థాయి అనుమతి లభించనుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభలో మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం రావడం వల్ల అణుశక్తి రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇక గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్-గ్రామీణ (వీబీ-జీ రామ్ జీ) బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా గ్రామీణ కూలీలకు ప్రతిఏటా 125 రోజుల ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇక కాలం చెల్లిన చట్టాలను తొలగించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిపీలింగ్ అమెండ్‌మెంట్ బిల్లు-2025కు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా 71 పాత చట్టాలను రద్దు చేయనున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications