IPO News: TVS గ్రూప్ నుంచి మార్కెట్లోకి మరో ఐపీవో.. షేర్ల ప్రైస్ బ్యాండ్ ఎంతంటే..?
IPO News: 2023 ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోల రాక వరదలా మారిపోయింది. ఈరోజు సైతం మార్కెట్లో యథార్త్ హాస్పిటల్స్ కంపెనీ షేర్లు మార్కెట్లో జాబితా చేయబడ్డాయి.
ఇదే క్రమంలో ప్రఖ్యాత టీవీఎస్ గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ ఐపీవో రాబోతోంది. అదే TVS సప్లై చైన్ సొల్యూషన్స్. కంపెనీ IPO గురువారం అంటే 10 ఆగస్టు 2023న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. ఆగస్టు 14 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరిచి ఉంటుంది. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ మొత్తం పరిమాణం రూ.880 కోట్లుగా ఉంది. ఈ ఐపీవోలో రూ.600 కోట్ల విలువైన తాజా ఇష్యూ ఉంది.

తాజాగా TVS సప్లై చైన్ సొల్యూషన్స్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ విడుదల చేసింది. కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.187-197గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్, గరిష్టంగా 13 లాట్‌లు కొనుగోలు చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాట్‌లో 76 షేర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం రిటైల్ ఇన్వెస్టర్లు రూ.14,972 కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 18, 2023న ఖరారు కావొచ్చని తెలుస్తోంది. అలాగే కంపెనీ షేర్లు ఆగస్టు 23న ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయబడతాయి.

TVS సప్లై చైన్ సొల్యూషన్స్ అనేది రవాణా, లాజిస్టిక్స్ & వేర్‌హౌసింగ్ కంపెనీ. ఇది ఇండియా, యూరప్, యుఎస్‌లోని ఆటోమోటివ్, కన్స్యూమర్ గూడ్స్, డిఫెన్స్, యుటిలిటీ రంగాల్లోని వినియోగదారులకు సప్లై చైన్ నిర్వహణ సేవలను అందిస్తుంది. కంపెనీ టీవీఎస్ మొబిలిటీ గ్రూప్‌లో ఒక భాగం. IPOకి ముందు కంపెనీలో ప్రమోటర్ల వాటా 46.65%గా ఉంది. తాజా ఐపీవో తర్వాత కంపెనీలో వారి వాటా 41.6%కి పరిమితం కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications