IPO News: ప్రీమియం ధరతో మార్కెట్లోకి ఐపీవో.. తొలిరోజే సూపర్ లాభాలతో పయనం..
TVS Supply Chain IPO: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఇందులో తాజాగా టీసీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ షేర్ లిస్టింగ్ జరిగింది. తొలిరోజే స్టాక్ మంచి లాభాల ప్రారంభాన్ని నమోదు చేసింది.
ఈరోజు టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ స్టాక్స్ దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టాయి. ఇష్యూ ధర కంటే 5 శాతం ప్రీమియం ధరకు రూ.207.05 వద్ద ఎన్ఎస్ఈలో షేర్ లిస్టింగ్ జరిగింది. ఇదే సమయంలో బీఎస్ఈలో షేర్ రూ.206.30 వద్ద తన ప్రయాణాన్ని మెుదలు పెట్టింది. కంపెనీ ఆగస్టు 10 నుంచి 14 మధ్య కాలంలో షేర్లను రూ.197 రేటు చొప్పున ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. TVS సప్లై చైన్ సొల్యూషన్స్ ఒక ప్రముఖ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయినప్పటికీ.. అత్యంత పోటీ పరిశ్రమలో పనిచేస్తుంది.

ఏదేమైనప్పటికీ స్టాక్ లిస్టింగ్‌కు ఒక రోజు ముందు గ్రే మార్కెట్‌లో అతితక్కువ ప్రీమియం కలిగి ఉన్నప్పటికీ.. ఊహించిన దాని కంటే మెరుగైన లైన్‌లలో మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.880 కోట్లను సమీకరించింది. ఐపీవో ఆఫర్ సమయంలో మెుత్తంగా 2.85 రెట్ల సబ్‌స్క్రిప్షన్ పొందింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ పోర్షన్ 1.37 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 2.44 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 7.89 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
చెన్నైకి చెందిన TVS సప్లై చైన్ సొల్యూషన్స్ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పెద్ద మధ్య తరహా వ్యాపారాలకు సరఫరా గొలుసు నిర్వహణ సేవలను అందిస్తోంది. స్టాక్ లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవాలని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్‌లోని ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ అనుభవి మిశ్రా సూచించారు.


Click it and Unblock the Notifications