TVS Radeon: స్టైలిష్ లుక్‌..కొత్త డ్యూయల్ కలర్ ఆప్షన్స్

ముంబై: దేశీయ టాప్ బైక్ అండ్ మొపెడ్ మేకర్ టీవీఎస్ కంపెనీ యాజమాన్యం.. కొత్త కలర్ ఆప్షన్లతో ద్విచక్ర వాహనాలను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టీవీఎస్ రేడియన్, టీవీఎస్ ఎక్స్ఎల్ 100ను కొత్త కలర్ ఆప్సన్స్‌తో విడుదల చేసింది. టీవీఎస్ రేడియన్ ఇప్పుడు రెండు కొత్త డ్యూయెల్ కలర్ ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది. బ్లూ/బ్లాక్, రెడ్/బ్లాక్ కలర్స్‌తో బైక్ రైడర్స్‌ను ఆకట్టుకోనున్నాయి. ఆకర్షణీయ రంగుల్లో డ్యూయెల్ కలర్ ఆప్షన్స్ అందుబాటులో వచ్చాయి.

టీవీఎస్ 100 ఎక్స్‌ఎల్ కోరల్ సిల్క్ షేడ్‌ అనే కొత్త కలర్‌తో మెరిసిపోతోంది. టీవీఎస్ రేడియన్ డ్యూయల్ టోన్ వేరియంట్ రేటు అధికంగా ఉంటోంది. ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే దీని ధర ఎక్కువే. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర 68,982 రూపాయలు. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 71,982 రూపాయలు. ఈ రెండు కూడా ఎక్స్‌షోరూమ్ ధరలే. ఇక కొత్త టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ధర విషయానికి వస్తే- కోరల్ సిల్క్ షేడ్ ధర 41,000 రూపాయలుగా ఉంటోంది. ఇందులో టాప్ వేరియంట్ ధర 52,334 రూపాయలు. అవి ఎక్స్‌షోరూమ్ ధరలు.

TVS Motor has launched new colours for its Radeon model, expects these two variants to boost sales

టీవీఎస్ రేడియన్‌లోని రెండు బైకుల డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉన్నాయి. మిగిలిన బైక్స్ పార్ట్స్ అన్నీ నలుపురంగులో ఉంటుంది. పెయింట్ స్కీమ్‌ను ఆధారంగా చేసుకుని, సైడ్ ప్యానెల్‌లో ఎరపు లేదా నీలం రంగు ఫీచర్స్‌ను ఇచ్చింది. ఈ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌ తప్ప టీవీఎస్ రేడియన్ బైక్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఇతర ఫీచర్స్ అన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి. దాన్ని మార్చే ప్రయత్నం చేసినట్లు కనిపించట్లేదు టీవీఎస్ మోటార్ యాజమాన్యం.

టీవీఎస్ రేడియన్ ఇంజిన్, సస్పెన్షన్, బ్రేక్స్ సిస్టమ్ ఇదివరకు ఉన్న మోడల్‌లోనే కొత్త కలర్ వేరియంట్‌లో ఉన్నాయి. ఇందులో కూడా ఎల్ఈడీ, డీఆర్ఎల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిల్లో మార్పులు చేయలేదు. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ కొత్త కలర్ ఆప్షన్లను తీసుకుని వచ్చింది. ఈ కలర్ ఆప్షన్స్.. టీవీఎస్ రేడియన్ సేల్స్ పెరగడానికి ఎంతవరకు దోహదపడతాయనేది ఆసక్తికరంగా మారింది.

దేశీయ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ టీవీఎస్ రేడియన్ యూనిట్లు దాదాపు నాలుగున్నర లక్షల వరకు విక్రయం అయ్యాయి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ యూనిట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డ్యూయెల్ కలర్ ఆప్షన్లను లెక్కలోకి తీసుకుంటే.. టీవీఎస్ మోటార్ రేడియన్ ఇప్పటిదాకా మొత్తం 10 కలర్లతో ఈ బైక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టయింది. టీవీఎస్ రేడియన్‌లో 109.7 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌‌ను కలిగి ఉంది. ఇది 8.08 బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ 100లో కోరల్ సిల్క్ షేడ్ కలర్ అందుబాటులోకి వచ్చింది. మింట్ బ్లూ, లస్టర్ గోల్డ్, రెడ్ బ్లాక్, గ్రే బ్లాక్ కలర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 99.7 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, 4 స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉందీ మొపెడ్. ఇది భారత్ స్టేజ్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్‌డేట్ అయింది. దీని ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 4.3 బీహెచ్‌పీ పవర్, 3,500 రివాల్యూషన్ పర్ మినిట్, 6.5 ఎన్ఎమ్ టార్క్‌‌ను అందిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+