టీవీఎస్ మోటార్స్ BS 6 ప్రమాణాలు కలిగిన టీవీఎస్ అపాచీ మోటార్ బైక్స్‌ను లాంచ్ చేసింది. అపాచీ RTR 160 4V, RTR 200 4V మోటార్ బైక్స్‌ను తీసుకు వచ్చింది. RTR 4V మోటార్ సైకిళ్లను సరికొత్త ఎల్ఈడీ ల్యాంప్, రేస్ గ్రాఫిక్స్ సహా ఇతర గ్రాఫిక్స్‌తో తీర్చిదిద్దింది.
197.75 CC సింగిల్ సిలిండర్ ఇంజిన్ అపాచీ RTR 200 4V డీసీ ధర రూ.1.24 లక్షలు కాగా, RTR 160 4V (డిస్క్) ధర రూ.1.03 లక్షలుగా ఉంది. RTR 160 4V (డ్రమ్) ధర రూ.99,950 గా ఉంది. 2020 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఈ రేస్ బైకులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కలిగి ఉంది.

టీవీఎస్ అపాచీ RTR 160 4V BS6 159.7 సీసీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్. 5 స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంది. RTR 200 4V BS6 197.75 సీసీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వచ్చింది. 5 స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications