అమెరికా కొత్త టారిఫ్‌లతో ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులు కొంచెం టెన్షన్‌లో పడేసాయి. కానీ రాష్ట్రం దానిని భయంగా కాకుండా, ఒక ఛాన్స్‌గా తీసుకుంటోంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ చెప్పినట్టుగా, ప్రభుత్వం ఇప్పటికే ఎగుమతిదారులకు సపోర్ట్ ఇచ్చే దిశగా కొన్ని స్టెప్స్ వేసింది. అంటే సవాళ్లు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ వాటిని అవకాశాలుగా మార్చుకోవడానికి రెడీగా ఉంది.

మంత్రి నారా లోకేష్ చెప్పినట్టుగా, "సమస్యలు వస్తే భయపడాల్సిన అవసరం లేదు. వాటి ద్వారా మార్పులు తీసుకువస్తాం. సవాళ్లను ఎదుర్కొంటేనే దేశం ముందుకు వెళ్తుంది."
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటోమోటివ్, ఎగుమతి రంగాల ప్రతినిధులతో కూర్చొని చర్చలు చేస్తుంది. ముఖ్యంగా ACMA సభ్యులతో 25% టారిఫ్ సవాల్‌ను తగ్గించే మార్గాలపై ఒక వర్కింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో వచ్చిన సూచనల ఆధారంగా, కంపెనీలకు కొంతకాలం సబ్సిడైజ్డ్ పవర్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో టారిఫ్ వల్ల వచ్చే భారాన్ని కనీసం 5% వరకు తగ్గించగలిగారు. అంతే కాదు, రాష్ట్రం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేస్తోంది. అంటే సవాల్ ఉన్నా, దాన్ని తగ్గించేలా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
సీ ఫుడ్ ఎగుమతిదారులకి సపోర్ట్**
సీ ఫుడ్ రంగం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎగుమతి రంగాలలో ఒకటి. రాష్ట్రం నుంచి వచ్చే ఎగుమతుల్లో పెద్ద వాటా ఈ రంగం నుంచే వస్తుంది. కానీ అమెరికా ట్రంప్ టారిఫ్‌లు వేసిన తర్వాత ఈ రంగం ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. ఎగుమతిదారులు "ఇక మన బిజినెస్ ఎలా కొనసాగుతుందో?" అని టెన్షన్ పడుతున్నారు.
ఈ భయాన్ని తగ్గించడానికి లోకేష్ ఓపెన్‌గా మాట్లాడారు. ఆయన చెప్పిన మాటల్లో, "మీరు భయపడాల్సిన అవసరం లేదు. ట్రంప్ టారిఫ్‌లతో మీ ఇండస్ట్రీ దెబ్బతింటుందని అనుకోకండి. మేము మీ వెనుక ఉన్నాం. సమస్యకి సొల్యూషన్ కూడా ఉంది" అని ధైర్యం చెప్పారు.
అందుకే ప్రభుత్వం ఎగుమతిదారులతో కూర్చొని గంటల తరబడి చర్చలు చేసి, వారికి సపోర్ట్ చేసే మార్గాలు వెతికింది. అంటే టారిఫ్‌లు సవాల్ అయితే, వాటిని ఎదుర్కొనే కొత్త అవకాశాల కోసం కూడా ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేస్తోందని చెప్పొచ్చు.
మూడు గంటల పాటు ఎగుమతిదారుల మరియు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. ఇక వర్కింగ్ గ్రూప్ ఇప్పటికే తన సిఫార్సులు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అమెరికా మనకి పెద్ద ఎగుమతి మార్కెట్ అయినా, రష్యా, చైనా, యూరప్ లాంటి కొత్త మార్కెట్లను కూడా చూడాలని లోకేష్ సూచించారు.
కేంద్రం నుంచి ఆర్థిక మద్దతు అడిగితే, లోకేష్ క్లారిటీ ఇచ్చారు మేము సహాయం అడిగితే దానిని రాజకీయ షరతులా అనుకోవద్దు. NDAకి మా మద్దతు ఎలాంటి షరతుల్లేకుండా ఉంది" అని చెప్పారు.
రాష్ట్రం కేవలం డబ్బు కోసం ఎదురుచూడకుండా, రీ ఫార్మ్స్ వైపు దృష్టి పెట్టింది. కేంద్రం సహాయం రావాలంటే రాష్ట్రం కూడా ముందడుగు వేయాలని లోకేష్ చెప్పారు. అందుకే లేబర్ రీ ఫార్మ్స్, ల్యాండ్ మార్పిడి రీ ఫార్మ్స్ లాంటివి కేవలం 45 రోజుల్లో పూర్తి చేశారు.
ఈ విషయంలో లోకేష్ స్పష్టంగా చెప్పారు. "సంక్షోభం వస్తే రాష్ట్రాలు కేవలం డబ్బు కోసం ఎదురు చూడకూడదు. దానికి బదులుగా సంస్కరణలు చేసి, కొత్త అవకాశాలు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరైంది కాదు" అని అన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications