Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. భక్తులకు బీమా కల్పించనున్న టీటీడీ..!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశాతో దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమలకు వచ్చే భక్తుల టీటీడీ అనేక ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో నిత్య అన్నదానం చేస్తారు. అలాగే కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు ఆహారాన్ని అందిస్తారు. తక్కువ ధరలకే రూమ్స్ కూడా కేటాయిస్తారు. భక్తుల మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్న టీటీడీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు బీమా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రమాదాలకు మాత్రమే బీమా కల్పించేవారు. కానీ ఇప్పుడు సహజ మరణానికి కూడా రూ.2 లక్షల బీమా కల్పించాలన్న ప్రతిపాదనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఒకే చెప్పింది. భక్తులు అలిపిరి టోల్‌ప్లాజా నుంచి తిరుమల కొండకు చేరుకుని, స్వామివారిని దర్శించుకుని తిరిగి అలిపిరి చేరే వరకు బీమా రక్షణ ఉంటుందని టీటీడీ ప్రకటించింది. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)తో ఒప్పందం చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. అటు ఎల్ఐసీ కూడా ఎలాంటి లాభాపేక్ష, సర్వీస్ ఛార్జీలు లేకుండా గ్రూప్ పాలసీ ఇవ్వనుంది.

పథకం కోసం టీటీడీ రూ.2.12 కోట్లను కేటాయించింది. క్లెయిమ్‌లు తక్కువగా ఉంటే, మిగిలిన నిధులను మరుసటి నెలకు క్యారీ ఫార్వర్డ్ చేయనున్నారు. అవసరమైతే అదనపు నిధులు సమకూర్చుతామని టీటీడీ ప్రకటించింది. ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే కొంత మంది భక్తులు టికెట్ బుక్ చేసుకుంటారు. కొంత మంది సర్వదర్శనం చేసుకుంటారు. కొంత మంది నడక దారిన కొండకు వెళ్తారు. వీరికి కూడా కూడా బీమా వర్తిస్తుందా.. అనే ప్రశ్నలకు టీటీడీ క్లారిటీ ఇచ్చింది. దర్శనం టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్న వారితో పాటు నేరుగా వచ్చే భక్తులందరికీ ఈ బీమా వర్తిస్తుందని వెల్లడించింది.
దర్శన టికెట్లు ఉన్నవారి వివరాలు నేరుగా ఎల్‌ఐసీ డేటాబేస్‌లో నమోదవుతాయని వివరించారు. టికెట్ లేనివారు క్యూలైన్లలోకి ప్రవేశించగానే తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సాంకేతికత ఆధారంగా వారిని గుర్తించి బీమా పరిధిలోకి తీసుకొస్తామని పేర్కొంది. భక్తులతోపాటు తిరుమలలో నిస్వార్థంగా సేవలందించే 'శ్రీవారి సేవకుల'కూ ఈ సదుపాయం వర్తిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ బీమా పరిధిలోకి టీటీడీ ఉద్యోగులు, స్థానికులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రవాణాదారులు రారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న వారికి కూడా బీమా వర్తించదు. కవరేజ్ ప్రారంభమైన మొదటి రోజును లీన్ పీరియడ్‌గా తీసుకుంటారు. ఈ ఒక్కరోజులో ప్రమాద మరణానికి మాత్రమే బీమా వర్తించనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
