Tirumala Laddu: నెయ్యి కల్తీపై రంగంలోకి టీటీడీ.. లేటైనా రైట్ డెసిషన్..!!
TTD Compalaint on Ghee: ప్రపంచ వ్యాప్తంగా హిందువులను, తిరుమల వెంకన్న భక్తులను నెయ్యి కల్తీ వ్యవహారం పెద్ద ఆందోళనలకు గురిచేసింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం మెల్లగా చల్లబడుతోంది. దీనిపై రంగంలోకి దిగిన టీటీడీ ముందుగా ఆగమ శాస్త్రాలకు అనుకరించి మహా శాంతి హోమం జరిపించగా, ప్రాయశ్చిత్త దీక్ష సైతం జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ విషయంపై నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఇటు ఏపీ సర్కార్ సైతం ఈ వ్యవహారంపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు సైతం నెయ్యి సరఫరాదారుకు నోటీసులు పంపించింది. ఇప్పటికే టీటీడీ ఏఆర్ డెయిరీని బ్లాక్ లిస్టులో పెట్టింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఈ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరాదారుల్లో ఒకటిగా కొనసాగుతోంది. జంతువుల కొవ్వు, చేప నూనె వంటివాటిని నెయ్యిలో గుర్తించినట్లు రిపోర్టులు వచ్చిన తర్వాత కంపెనీకి షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా సంతృప్తికరమైన వివరణను అందించడంలో విఫలమైతే క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పింది.

టీటీడీ నేడు ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. లడ్డూ నాణ్య్తపై వస్తున్న ఫిర్యాదుల ఆదారంగా కేసు పెట్టింది. ఏఐర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని టీటీడీ కోరింది. జూన్ 12, 20, 25 తేదీల్లో ట్యాంకర్ల ద్వారా నెయ్యిని సరఫరా చేసినట్లు వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయటంపై చర్యలు చేపట్టాలని టీటీడీ తన ఫిర్యాదులో కోరింది. జూలై 6, 12 పంపిన నెయ్యి నమూనాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే NDDB CALF రిపోర్టులో మాత్రం పంది కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు తేలలేదు.
మాజీ సీఎం కీలక కామెంట్స్..
తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు రాజకీయానికి ఉపయోగించారని మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు సీఎం చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications