TTD Assets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా గుర్తింపు ఉంది. అనేక ప్రదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలా వారు దేవదేవుడికి డబ్బు, బంగారం, స్థలాలు, వెండి, వాహనాలు, వజ్రాలు ఇలా అనేక రూపాల్లో తమ మెుక్కులను తీర్చుకుంటుంటారు. అయితే తాజాగా టీటీడీ స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం బాలాజీ ఆస్తుల విలువ ఎంత అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అనేక దేశాల జీడీపీ..
ప్రస్తుతం స్వామివారి ఆస్తుల చిట్టా ప్రకారం టీటీడీ సంపద చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉందని తేలింది. తాజా లెక్కల ప్రకారం దేశంలోని అనేక బ్యాంకులవద్ద ఉన్న వెంకన్న బంగారు మెుత్తం 10.3 టన్నులని తేలింది. ఇందులో 2.5 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం పురాతన వస్తువులు, అమూల్యమైనవి ఉన్నాయి. ఈ డిపాజిట్లపై వడ్డీని కూడా బ్యాంకులు బంగారం రూపంలోనే చెల్లిస్తాయంట. వీటి పూర్తి విలువ దాదాపు రూ.5,300 కోట్లు. ఇదే క్రమంలో నగదు డిపాజిట్లు రూ.15,938 కోట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7,123 ఎకరాల మేర 960 ఆస్తులు ఉన్నాయి.

మెుత్తం ఆస్తుల విలువ..
దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా భావించబడే లార్డ్ వెంకటేశ్వర ఆలయం ఆస్తుల నికర విలువ రూ.2.3 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. 1933లో స్థాపించబడిన తర్వాత మొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం దాని నికర విలువను ప్రకటించింది. అయితే ఇది ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ. దాదాపు 35 దేశాల జీడీపీ కంటే టీటీడీ ఆస్తులవిలువే ఎక్కువ.

టీటీడీ వివరణ..
దేవస్థానం బోర్డు 2019 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ గైడ్‌లైన్స్‌ను బలోపేతం చేసింది. స్వామివారి ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. స్వామివారి డబ్బు, బంగారాలను నేషనల్ బ్యాంకుల్లో భద్రపరిచినట్లు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్లు తిరుమలను పోలిన దేవాలయాలను టీటీడీ నిర్మిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications