అమెరికాలో భారతీయులకు హై అలర్ట్, సునామీతో పలు దేశాలు విలవిల..రష్యా భూకంపం నష్టం ఎంతంటే..

రష్యా తీరాన్ని భారీ భూకంపం వణికించింది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భూకంపం విరుచుకుపడింది. రష్యాలోని కురిల్‌ దీవులు, జపాన్‌లోని హొక్కైడో దీవులలో రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ భూకంపం నేపథ్యంలో అమెరికా, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అలస్కా, హవాయి ద్వీపాలను కలుపుకుని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా జాతీయ సునామీ కేంద్రం. హెచ్చరికలు ఎత్తివేసే వరకు సముద్ర తీరానికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.హవాయి ద్వీపంలో పర్యాటకు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గ‌విన్ న్యూస‌మ్ కీలక ప్రకటన జారీ చేశారు.

భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ: భారీ సునామి నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్‌ కూడా అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్‌ జనరల్‌ తెలిపింది. అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేస్తే వెంటనే ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లిపోవాలని తెలిపింది. అమెరికాలో తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని యుకేలోని భారత పౌరులకు భారత కాన్సులేట్‌ జనరల్‌ సూచించింది. అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలని.. మీ మొబైల్స్ చార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలని, సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కోరింది.

Earthquake off Russia s Kamchatka Peninsula triggers tsunami watch Evacuations in Japan Russia Megathrust Quake of 2025 Magnitude 8 8 Quake Off Russia Russia Megathrust Quake Russia s Kamchatka Quake Sparks Tsunami Alert from Alaska to California Tsunami Warnings for Hawaii 8 8 alert 2025 amp amp 2025

భారీ నష్టం జరిగిందని అంచనా: ప్రపంచంలోనే 2011 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ అత్యంత శక్తివంతమైన భూంకంపం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. భూంకంపం నేపథ్యంలో కంచట్కా, పెట్రోపావ్లోవ్‌స్క్‌ నగరాల్లోని పలు భవనాలు ఒక్కసారిగా ప్రకంపనలకు గురి అయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.భూకంపం వచ్చిన సమయంలో భవనాల లోపల తీవ్రమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు నివేదికలు వెల్లడి చేస్తున్నాయి.

ఒక వీడియోలో, నివాస అపార్ట్‌మెంట్‌లోని ఫర్నిచర్ తీవ్రంగా కదిలిపోతూ భూకంప తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్న దృశ్యం కనబడుతోంది. హ‌వాయి ద్వీపం అల్లకల్లోలంగా మారింది. హక్కైడో ద్వీపంలో ఓడరేవులకు భారీ నష్టం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అపార్టుమెంట్లు చాలా చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు కొన్ని చోట్ల నేలకు ఒరిగినట్లు వార్తలు వస్తున్నాయి. భూకంప తీవ్రత నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలల ప్రభావంతో జపాన్ తీరప్రాంతంలో నాలుగు తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయని అధికారులు తెలిపారు.

సునామి తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలోని పసిఫిక్‌ తీర ప్రాంతాలకూ తీవ్ర ముప్పు పొంచి ఉందని.. ప్రజలు ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని పోస్టులో తెలిపారు.

జపాన్‌లోని పసిఫిక్‌ తీరంలో ఉన్న కొన్ని దీవులను tsunami కి చెందిన రాకాసి అలలు చేరుకొన్నాయి. టొకచాయ్‌ పోర్టులో 40 సెంటీమీటర్ల మేర అలలు ఎగసి పడుతున్నాయి.. ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు ముందుకు దూసుకువచ్చాయి. దీంతోపాటు థోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు ఎగసిపడుతున్నాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్ల ఎత్తున అలలు వచ్చినట్లు ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఇషినోమొకి పోర్టులో 50 సెంటీమీటర్ల అలలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈక్వెడార్‌, రష్యా, వాయువ్య హవాయిన్‌ ఐలాండ్స్‌ చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్‌ పాలినేషియా తదితర దేశాల్లో అలలు మూడు నుంచి అయిదు మీటర్ల మేర ఎగసి పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+