For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Penalty To SBI: స్టేట్ బ్యాంక్ కు భారీ పెనాల్టీ.. వారి ఖాతాలో నిర్లక్ష్యం వహించినందుకే.. ఇలాంటి వారితో జాగ్రత్

|

Penalty To SBI: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ (TSCDRC) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఠి బ్రాంచ్ కు భారీ పెనాల్టీ విధించింది. వినియోగదారుడి నుంచి ఎలాంటి దరఖాస్తు లేకుండా అతని ఖాతాను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో లింక్ చేసినందుకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బ్యాంక్ చేసిన పని కారణంగా అతడు ఆన్‌లైన్ మోసానికి బాధితుడు కావటంతో సంచలన తీర్పు వెలువరించింది. ఖాతాదురునికి రూ.63,74,527 తిరిగి చెల్లించాలని బ్యాంక్ కు వెల్లడించింది.

అసలు ఏమైంది..

అసలు ఏమైంది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన 92 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీరేష్ చంద్ర గంగోపాధ్యాయ పాక్షికంగా అంధుడు. రెండవ ఫిర్యాదుదారుగా ఉన్న 86 ఏళ్ల అతని భార్య ఆరతి గంగోపాధ్యాయ పూర్తిగా అంధురాలు. వీరు ఎస్‌బీఐ, బల్కంపేట బ్రాంచ్‌లో జాయింట్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరిచారు. వారు 2017లో రూ. 10 లక్షలు, రూ. 15 లక్షలు, రూ. 15 లక్షలకు మూడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను ఒక సంవత్సరం పాటు ఆటో-రెన్యూవల్ కోసం ఆరతి గంగోపాధ్యాయ పేరు మీద జారీ చేసిన ఎఫ్‌డీని ప్రారంభించారు. వారి ఖాతాలో దాదాపు రూ. 28 లక్షలకు బదులు రూ.3 లక్షలు మాత్రమే బ్యాలెన్స్‌ని చూపించింది. ఈ ఖాతాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం లేదు. అయితే అనధికారికంగా విత్‌డ్రాలన్నీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే జరిగాయని ఆయన గమనించారు.

పోలీసుల విచారణలో వాస్తవాలు..

పోలీసుల విచారణలో వాస్తవాలు..

మెుత్తం 37 లావాదేవీలు మొత్తం ఐదు కంపెనీల పేరిట రూ.63,74,536 జరిగాయి. ఆరతి గంగోపాధ్యాయ ఇంటర్నెట్ క్రెడెన్షియల్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉల్లంఘించిన ప్రతి సందర్భాలలో OTP లు పంపబడ్డాయని బ్యాంక్ వాదించింది. వివాదాస్పద లావాదేవీల్లో ఫిర్యాదుదారుల గృహ సహాయకుడి పాత్ర ఉన్నట్లు తేలింది.

యాక్సెస్ ఇవ్వనపప్పటికీ..

యాక్సెస్ ఇవ్వనపప్పటికీ..

వ్యూ ఓన్లీ యాక్సెస్ పొందుతున్న ఖాతాదారుల విషయంలో వాస్తవాలను పరిశీలించకుండా బ్యాంక్ డబ్బు బదిలీ చేయటం సరికాదని కమీషన్ అభిప్రాయపడింది. దీని వెనుక బ్యాంక్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిపింది. సరైన ధృవీకరణ లేకుండా కస్టమర్ కు హాని కలిగించే ట్రాన్సాక్షన్లకు కారణమైనందుకు బ్యాంక్ ఈ మెుత్తాన్ని భర్తీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.

Read more about: sbi hyderabad
English summary

Penalty To SBI: స్టేట్ బ్యాంక్ కు భారీ పెనాల్టీ.. వారి ఖాతాలో నిర్లక్ష్యం వహించినందుకే.. ఇలాంటి వారితో జాగ్రత్ | TSCDRC imposed penalty on SBI koti branch of hyderabad to reimburse Rs 63.7 lakh to senior citizen

SBI ordered to reimburse Rs 63.7 lakh to senior citizen
Story first published: Sunday, August 21, 2022, 19:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X