IPO News: సూపర్ లాభాలతో లిస్టింగ్ అయిన ఐపీవో.. అప్పర్ సర్క్యూట్ తాకి రచ్చ..

Trust Fintech IPO: నేడు మార్కెట్ల మెగా ర్యాలీలో లిస్ట్ అయిన ఐపీవో సూపర్ ప్రీమియం లాభాలను తన ఇన్వెస్టర్లకు అందించింది. బంపర్ లిస్టింగ్ తర్వాత షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకటంతో బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు కుషీగా ఉన్నారు.

ట్రస్ట్ ఫిన్‌టెక్ కంపెనీ ఐపీవో నేడు స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడింది. ఈ క్రమంలో షేర్లు 41.83% ప్రీమియంతో NSE SMEలో రూ.143.25 వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి ట్రస్ట్ ఫిన్‌టెక్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.101 గరిష్ఠంగా ఉన్న సంగతి తెలిసిందే. లిస్టింగ్ తర్వాత స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకి గరిష్టంగా రూ.150.40 రేటును తాకింది.

Trust Fintech IPO Made investors rich with 41 83 bumper listing on first day

ట్రస్ట్ ఫిన్‌టెక్ ఐపీవో మార్చి 26న రిటైల్ పెట్టుబడి కోసం తెరవబడి మార్చి 28న ముగిసింది. ఏప్రిల్ 2న IPO కేటాయింపు ఖరారు కాగా.. ఏప్రిల్ 4న షేర్ల లిస్టింగ్ తేదీని నిర్ణయించారు. తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.63.45 కోట్లను సేకరించింది. దీనికోసం 62.82 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఈ క్రమంలో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.95-రూ.101గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 1,200 షేర్లుగా నిర్ణయించటమైనది.

ఎస్ఎమ్ఈ ఐపీవో పెట్టుబడిదారుల నుంచి బలమైన డిమాండ్‌ను చూసింది. ఇష్యూ మొత్తం 108.63 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఐపీవో రిటైల్ విభాగంలో 75.10 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 65.38 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 244.48 రెట్లు సభ్యత్వం పొందింది.

ట్రస్ట్ ఫిన్‌టెక్ లిమిటెడ్ అనేది BFSI రంగానికి కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్, IT సొల్యూషన్స్, ERP అమలు, టైలర్ మేడ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ డెవలప్‌మెంట్, SAP B1, ఆఫ్‌షోర్ IT సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ. ఇది వాణిజ్య, సహకార బ్యాంకులు, ఆర్థిక సంస్థల కోసం 10 కంటే ఎక్కువ బ్యాంకింగ్ ఉత్పత్తులను అందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+