America-Iran: అణు ప్రస్తావన లేకుండానే శాంతి ఒప్పందం.. ట్రంప్ యూటర్న్..!
ఇరాన్, అమెరికాల మధ్య కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అణు కార్యక్రమాలు ఆపాలని అమెరికా హెచ్చరించినా ఇరాన్ వెనక్కు తగ్గకపోవడంతో అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తోంది. ప్రతి ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా రక్షణ స్థావరాలపై దాడులు చేసింది. అంతేకాకుండా ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడ్డాయి. అయితే ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జలసంధిలో నౌకలపై దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
అమెరికా ఇరాన్ పై మళ్లీ దాడులు మొదలు పెట్టింది. ప్రతిగా ఇరాన్ జలసంధిని మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ మాత్రం తలొగ్గడం లేదు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. దీంతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. ఈ యుద్ధం వల్ల అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతుంది. అంతేకాకుండా అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటి వరకు దాడులు చేస్తామని హెచ్చరించిన ఆయన ఇరాన్ తో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

అణు ఒప్పందం లేకుండానే శాంతి ఒప్పందం కుదిరినా ఒకేనని ఆయన భవిస్తున్నారని తెలుస్తోంది. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో తగ్గుతున్న ఆయుధ నిల్వలు, మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గుతున్నట్లు సమాచారం. అందుకే ఇరాన్ తో ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిని పూర్తి ఓపెన్ చేసేందుకు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అణు ఒప్పందం లేకుండా జలసంధి తెరిచేలా డీల్ చేసుకోవాలని ట్రంప్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఇరాన్ హర్మూజ్ జల సంధి విషయంలో పలు షరతులు విధిస్తోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే వరకు హర్మూజ్‌ను తెరవబోమని స్పష్టం చేసింది. శాంతి ఒప్పందానికి సంబంధించి త్వరలోనే ఇరాన్ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరాన్‌తో చర్చల విషయంలో తొందరేం లేదని ఓ అమెరికా అధికారి తెలిపారు. టెహ్రాన్‌లో కూడా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని గుర్తు చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications