అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 మిలియన్ల డాలర్లకి అమెరికా పౌరసత్వం కోసం "గోల్డ్ కార్డ్" అనే కొత్త వీసాని ప్రవేశపెట్టారు, దీని వల్ల భారతీయ గ్రాడ్యుయేట్లు ఇంకా పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ పద్ధతి గొప్ప ఆదాయాన్ని తెస్తుందని, ప్రస్తుత EB-5 వీసా ప్రోగ్రాం భర్తీ చేయడానికి రూపొందించబడిందని అంచన.
భారతీయ గ్రాడ్యుయేట్లకు కొత్త అవకాశం
ఈ కొత్త ప్రోగ్రాం ద్వారా అమెరికన్ కంపెనీలు అమెరికన్ విశ్వవిద్యాలయాల నుండి భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి వీలు కలుగుతుందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుత ఇమిగ్రేషన్ విధానాలు ముఖ్యంగా భారతదేశం నుండి చదువు పూర్తి చేసిన తర్వాత వచ్చాక స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్'ని అమెరికాలో ఉండకుండా ఎలా నిరోధించాయో ఆయన హైలైట్ చేశారు.

"ఒక వ్యక్తి భారతదేశం, చైనా, జపాన్ లేదా ఏదైనా ప్రదేశం నుండి వచ్చాక హార్వర్డ్ లేదా వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్‌కి వెళ్తాడు.. అక్కడ వారికి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి, కానీ ఆ వ్యక్తి దేశంలో ఉండొచ్చా లేద అనే ఆలోచన ఉండదు అందుకే ఆఫర్ వెంటనే రద్దు అవుతుంది" అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఈ గ్రాడ్యుయేట్లలో చాలామంది వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళాక విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారుతున్నారని ఆయన అంగీకరించారు. "వారు భారతదేశానికి తిరిగి వెళ్ళాక లేదా వారు వచ్చిన దేశానికి తిరిగి వెళ్ళాక ఒక కంపెనీని తెరుస్తారు తరువాత వారు బిలియనీర్లు అవుతారు. ఇంకా వారు వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు" అని ట్రంప్ అన్నారు, ఈ విధంగా US ఆర్థిక నష్టాన్ని అయన ఎత్తి చూపారు. గోల్డ్ కార్డ్ కొన్ని వారాల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అయితే దీని అమలు ఇంకా పర్యవేక్షణకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే కాలంలో వెల్లడవుతాయని అమెరికా సూచించింది. EB-5కి పరిమితి ఉన్నట్టు కాకుండా, గోల్డ్ కార్డ్ వీసా జారీపై ఎటువంటి పరిమితి లేదు. కొన్ని వారాల్లో EB-5 వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డ్ వస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు.
H-1B వీసాపై ఉన్న ఇండియన్స్ గోల్డ్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చా?
$5 మిలియన్లు చెల్లించగల ఎవరైనా గోల్డ్ కార్డ్ వీసా కోసం అప్లయ్ చేసుకోవచ్చు. దీని అర్థం కంపెనీలు హై స్కిల్స్ ఉన్న ఉద్యోగులను స్పాన్సర్ చేయవచ్చు, కానీ దీనికి సంబంధించి వివరాలు కొత్త అస్పష్టంగానే ఉన్నాయి. గోల్డ్ కార్డ్ భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యవస్థాపకులు, టెక్ ఎగ్జిక్యూటివ్‌లు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ కార్డ్ వీసా పొందలేని భారతీయులు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు (EB-1, EB-2, EB-3) అండ్ H1-B ప్రోగ్రామ్‌తో వారి అదృష్టాన్ని ప్రయత్నించవచ్చు, అయినగాని ప్రాసెసింగ్ సమయం చాలా ఎక్కువ.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications