అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త H-1B వీసాలపై 100,000 డాలర్ల రుసుము ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్లు, యజమానులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, నర్సింగ్ సంస్థలు, మతపరమైన సంఘాలు కలిసి ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో దాఖలైన ఈ కేసు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగిన మొట్టమొదటి పెద్ద కేసు కావడం గమనార్హం.
ఈ కేసులో ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని కేసు వేసిన వారు స్పష్టంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి కొన్ని వీసా ప్రవేశాలపై పరిమితులు విధించే హక్కు ఉన్నప్పటికీ, కొత్త రుసుములు లేదా పన్నులు విధించే అధికారం మాత్రం కాంగ్రెస్‌కే ఉంది. కానీ ఈ ఆదేశంతో, ఆయన చట్టాన్ని తిరిగి రాసినట్టే అయిందని వారు వాదిస్తున్నారు.దావాలో మరొక కీలక అంశం ఏమిటంటే, ఈ ఆదేశం వలన యజమానులు కొత్త వీసా కోసం 100,000 డాలర్లు చెల్లించాలి లేదా జాతీయ ఆసక్తి మినహాయింపుకోసం ప్రయత్నించాలి. ఈ మినహాయింపును ఇవ్వాలా వద్దా అనేది హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారుల అభీష్టంపై ఆధారపడుతుంది. అంటే, ఇది అవినీతి, సెలెక్టివ్ నిర్ణయాలకు అవకాశం కల్పించే విధానం అని ఆరోపిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఈ ఆదేశాన్ని సమర్థిస్తూ.. ఈ రుసుం అనేది విదేశీ ప్రతిభను తెచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాకుండా, అమెరికన్ కార్మికుల వేతనాలను రక్షించడమే ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పారు. తక్కువ వేతనాలపై వచ్చే వలస కార్మికులు అమెరికన్లను పోటీలో వెనక్కి నెట్టారని, ఇది దేశానికి ఆర్థికంగా, జాతీయ భద్రత పరంగా ప్రమాదకరమని ట్రంప్ వాదిస్తున్నారు.
H-1B వీసాలు ప్రధానంగా టెక్నాలజీ, హెల్త్‌కేర్, విద్యారంగం వంటి కీలక రంగాలలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో పనిచేయడానికి అనుమతిస్తాయి. ప్రతి సంవత్సరం 65 వేల వీసాలు జారీ చేయడం జరుగుతుంది. అదనంగా, మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేసిన వారికి 20 వేల ప్రత్యేక వీసాలు కేటాయిస్తారు. గత సంవత్సరం ఆమోదం పొందిన H-1B వీసాల్లో 71 శాతం భారతీయులకు దక్కగా, చైనాకు సుమారు 12 శాతం వచ్చాయి. ఇది భారతీయ IT రంగానికి ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే యజమానులు ఒక్కో H-1B వీసాకు 2 వేల నుంచి 5 వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. అయితే ఈ కొత్త ఆదేశం వల్ల ఆ మొత్తం ఒకేసారి 100,000కి డాలర్లకి పెరుగుతుంది. మినహాయింపు లభించకపోతే. ఇది చిన్న కంపెనీలకు మరింత భారంగా మారనుంది.ఈ నేపథ్యంలోనే విమర్శకులు ఈ ఆదేశాన్ని "ప్రపంచ ప్రతిభను అణగదొక్కే చర్యగా అభివర్ణిస్తున్నారు. టెక్ పరిశ్రమలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వంటి రంగాలు అంతర్జాతీయ నైపుణ్యంపై ఎక్కువగా ఆధారపడుతుంటాయి. కొత్త రుసుము కారణంగా ఈ రంగాలు సిబ్బంది కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో న్యాయ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఒక అధ్యక్షుడు నేరుగా ఆర్థిక రుసుములు విధించే హక్కు ఉందా? లేక అది కేవలం కాంగ్రెస్ పరిధిలోనిదా? అనే ప్రశ్న కోర్టులో ప్రధాన చర్చగా మారింది. ఈ కేసు ఫలితంపై అమెరికా వలస విధానం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కోర్టు వాదుల పక్షాన ఉంటే, అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలకు సరిహద్దులు ఖరారు అవుతాయి. ఒక వేళ ట్రంప్ గెలిస్తే H-1B వీసా వ్యవస్థను విమర్శకులు చెప్పినట్టుగా ట్రంప్ ఆట ఆడే విధానంగా మార్చేస్తుంది.
ప్రస్తుతం, ఈ ఆదేశం కొత్త దరఖాస్తుదారులకే వర్తిస్తుంది. ఇప్పటికే H-1B కలిగినవారు లేదా సెప్టెంబర్ 21కి ముందు దాఖలు చేసిన వారు మినహాయింపు పొందుతారు. అయినప్పటికీ ఈ అనిశ్చితి ఇప్పటికే అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, టెక్ కంపెనీలు, ఆసుపత్రులను అస్థిరతలోకి నెట్టింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications