మూడవ ప్రపంచ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. రష్యా అధినేత పుతిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం ఆగకపోతే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. వైట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. ఈ యుద్ధం ఇప్పటికే అపారమైన మానవ నష్టాన్ని కలిగించిందని, తక్షణమే దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని స్పష్టం ట్రంప్ చేశారు.

గత నెలలోనే దాదాపు 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారని.. వారిలో ఎక్కువ మంది సైనికులేనని ట్రంప్ వెల్లడించారు. ఈ హత్యలు ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క నెలలోనే వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆగాలి. దాని కోసం మేము తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ రక్తపాతం కొనసాగితే ప్రపంచ స్థాయిలో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రత పెరుగుతూనే ఉంటే అది గ్లోబల్ విపత్తుగా మారే ప్రమాదం ఉందని Trump వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘర్షణలే మూడో ప్రపంచ యుద్ధాలకు దారితీస్తాయి. ప్రజలు ఇలాగే రాజకీయ ఆటలు ఆడుతూనే ఉంటే.. చివరికి మనం ప్రపంచ యుద్ధంలోకి జారిపోతాం. అది జరగడం మనం చూడదలుచుకోలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Trump World War III warning Russia Ukraine war escalation Trump Ukraine comments World War 3 fears Russia Ukraine conflict news Trump foreign policy warning global war risk Trump Russia Ukraine statement geopolitical tensions Ukraine war latest news Trump says more action less talk

గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న శాంతి చర్చల్లో ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకపోవడంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, కానీ ఆచరణాత్మక చర్యలు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మాటలు తక్కువగా, చర్యలు ఎక్కువగా ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపారు.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించారు. రష్యా - ఉక్రెయిన్ అధికారుల నుంచి వస్తున్న నామమాత్రపు హామీలు ట్రంప్‌ను సంతృప్తిపరచడం లేదని ఆమె స్పష్టం చేశారు. సమావేశం కోసమే ఈ సమావేశాలు జరగడం అధ్యక్షుడికి విసుగు తెప్పిస్తోంది. ఆయనకు ఇక మాటలు వద్దు. ఈ యుద్ధం ముగియాలనే స్పష్టమైన చర్యలు కావాలని కోరుకుంటున్నారని లెవిట్ తెలిపారు.

యుద్ధాన్ని ఆపడానికి తమ పరిపాలన 28 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను ముందుకు తెచ్చిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రణాళిక ద్వారా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు, రాజకీయ పరిష్కారానికి దారి తీయాలని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జెలెన్స్కీ ప్రత్యామ్నాయంగా 20 అంశాలతో కూడిన మరో శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు.

ట్రంప్ ప్రణాళికలో డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించే అంశం ఉందని, దానికి తాను అంగీకరించబోనని జెలెన్స్కీ స్పష్టం చేశారు. భూభాగ సంబంధిత రాయితీల విషయంలో ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని ఆయన అన్నారు. అమెరికాతో కలిసి ఆర్థికాభివృద్ధి, పునర్నిర్మాణ ప్రణాళికలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, దేశ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు మాత్రం ప్రజల సమ్మతితోనే తీసుకుంటామని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం పాలన కూడా మరో కీలక వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.

ఏదేమైనా ట్రంప్ పరిపాలన శాంతి ప్రయత్నాల్లో చురుకుగా పాల్గొంటుందని కరోలిన్ లెవిట్ మరోసారి ధృవీకరించారు. ఈ యుద్ధానికి ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపించే పరిస్థితి రాకుండా చూడటమే అధ్యక్షుడి లక్ష్యమని ఆమె తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+