గ్రీన్‌లాండ్‌పై పెత్తనం చెలాయించాలనే అమెరికా ఆసక్తి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన టారిఫ్స్ ప్రకటన ఆందోళనకరంగా మారింది. ఈ ఆర్కిటిక్ దీవిపై అమెరికా నియంత్రణకు సహకరించని దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్‌లో నిర్వహించిన హెల్త్ రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. అమెరికా దేశ భద్రతకు గ్రీన్‌లాండ్ అత్యంత కీలకమని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం రష్యా, చైనా తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నాయని, దీని వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆరోపణలను రష్యా ఖండిస్తూ.. ఆర్కిటిక్ ప్రాంతాన్ని సైనికీకరించడం ప్రపంచ శాంతికి ప్రమాదకరమని హెచ్చరించింది. ఇదే సమయంలో డెన్మార్క్‌కు మద్దతుగా పలు యూరోపియన్ దేశాలు తమ సైనిక దళాలను గ్రీన్‌లాండ్‌కు పంపించాయి. గురువారం కూడా ఈ దళాల రాక కొనసాగడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో సూచిస్తోంది. డెన్మార్క్, గ్రీన్‌లాండ్, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ ఆర్కిటిక్ ద్వీపం భవిష్యత్తుపై అమెరికా, యూరోపియన్ మిత్రదేశాల మధ్య మౌలిక అంగీకారం లేదనే విషయం స్పష్టమవుతోంది.

నాటో ప్రత్యక్ష కమాండ్‌కు వెలుపల ఈ విధంగా యూరోపియన్ దేశాలు సంయుక్తంగా సైనిక చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యురెన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని యూరోపియన్ దేశాలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ 15 మంది మౌంటెయిన్ స్పెషలిస్టులతో కూడిన బృందాన్ని పంపించింది. జర్మనీ 13 మంది రికనయిస్సెన్స్ నిపుణులతో కూడిన బృందాన్ని గ్రీన్‌లాండ్‌కు తరలించింది. యూకే ఒక అధికారిని, నార్వే ఇద్దర్ని, స్వీడన్ ముగ్గుర్ని పంపి ఈ ఆపరేషన్‌కు మద్దతు తెలిపాయి. గ్రీన్‌లాండ్‌లో యూరోపియన్ దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.
అమెరికా చేస్తున్న ఆధిపత్యంపై రష్యా, పోలండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. Greenland కోసం జరుగుతున్న ఈ ఘర్షణ యుగాంతానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. రష్యా మాజీ డిప్యూటీ మంత్రి దిమిత్రి రోగోజిన్ మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌లో అణు దళాలను మోహరించాలనే ఆలోచన అమెరికాకు ఉందని ఆరోపించారు. దీనివల్ల రష్యా, చైనాలపై అణ్వాయుధ ఆధిపత్యాన్ని సాధించవచ్చని అమెరికా భావిస్తున్నదని అన్నారు. అయితే ఇది 1945 తర్వాత అణ్వాయుధాల వినియోగాన్ని అడ్డుకుంటూ వచ్చిన వ్యూహాత్మక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ఆర్కిటిక్ ప్రాంతం రష్యా, అమెరికాల మధ్య అణు వార్‌హెడ్స్ వేగంగా ప్రయాణించగల కీలక మార్గమని రోగోజిన్ పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను కబ్జా చేస్తే అణ్వాయుధ పరంగా పైచేయి సాధించవచ్చన్న భావన ప్రపంచం అంతానికి నాంది కావచ్చని హెచ్చరించారు. రష్యా కొత్త ఖండాంతర అణు క్షిపణి 'సర్మాట్' లేదా 'సాతాన్-2'ను ప్రస్తావిస్తూ.. అణు యుద్ధం జరిగితే మానవాళికి మిగిలే అవకాశం కూడా ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ కూడా స్పందిస్తూ.. గ్రీన్‌లాండ్‌పై ఘర్షణ పాశ్చాత్య దేశాలకు.. ప్రపంచానికి విపరీతమైన విధ్వంసాన్ని తెచ్చిపెట్టవచ్చని హెచ్చరించారు.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications