అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన 'టారిఫ్' అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్ పై ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా అమెరికాకు చేసే ఎగుమతులపై 25% అదనపు సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. "ట్రూత్ సోషల్" వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో కలకలం రేపుతోంది. ఇరాన్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ఇండియాపై పడనున్న పన్ను భారం ఎంత?
భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే ఇప్పటికే భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు పన్నులు విధిస్తోంది. ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్స్ కాగా మరో 25% రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు విధిస్తున్న రుసుము. ఇప్పుడు తాజా టారిఫ్స్ (US Tariffs) ప్రకటనతో ఇరాన్ తో వ్యాపారం చేస్తున్నందుకు మరో 25% తోడైతే భారత ఎగుమతులపై పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం ఉంది. ఇది మన దేశ ఎగుమతిదారులకు పెను సవాలుగా మారనుంది.
భారత్ - ఇరాన్ వాణిజ్య సంబంధాలు
ఇరాన్ కు అత్యధికంగా ఎగుమతులు చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా బాస్మతీ బియ్యం, టీ, చక్కెర, మందులు (Pharmaceuticals), ఎలక్ట్రికల్ మిషనరీ వంటివి భారత్ నుంచి ఇరాన్ కు వెళ్తుంటాయి. మరోవైపు మనం ఇరాన్ నుండి డ్రై ఫ్రూట్స్, కెమికల్స్, గ్లాస్‌వేర్ దిగుమతి చేసుకుంటాము. 2025 అక్టోబర్ గణాంకాల ప్రకారం.. ఇరాన్‌కు భారత ఎగుమతులు 56.1 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కొత్త పన్నుల వల్ల ఈ వాణిజ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.
చాబహార్ పోర్ట్, వ్యూహాత్మక చిక్కులు
భారతదేశానికి ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ చాలా కీలకం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా ఇది ఒక గేట్‌వేలా పనిచేస్తుంది. అమెరికా ఇప్పటికే ఈ పోర్ట్ కార్యకలాపాలకు ఇచ్చిన శాంక్షన్ మినహాయింపును (Waiver) ఈ ఏడాది ఏప్రిల్ వరకు పొడిగించింది. అయితే తాజా టారిఫ్స్ (US Tariffs) నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న భారతీయ సంస్థలు అమెరికా ఆంక్షల బారిన పడే అవకాశం ఉంది.
మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం ఉంది. అయితే ఇది భారత్ వంటి మిత్ర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం భారత్ చర్చలు జరుపుతోంది. ఇరాన్‌తో ఉన్న చారిత్రక సంబంధాలను కాపాడుకుంటూనే, అమెరికా విధించే భారీ పన్నుల నుండి మన ఎగుమతిదారులను ఎలా కాపాడుకోవాలన్నది ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న. ఇరాన్‌లోని అంతర్గత నిరసనలు అమెరికా సుప్రీంకోర్టులో టారిఫ్ చట్టాలపై జరుగుతున్న విచారణలు ఈ పరిస్థితిని ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.
More From GoodReturns

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

ఇరాన్‌పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications