గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిపివేత చట్టవిరుద్ధం..ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన యుఎస్ కోర్టు..

అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ గ్రీన్‌కార్డులు, వర్క్‌ పర్మిట్లు, పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీయులకు అమెరికా ఫెడరల్‌ కోర్టు చారిత్రాత్మక తీర్పుతో ఊరట లభించింది. 39 దేశాలకు చెందిన వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠినమైన వలస ఆంక్షలు పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చిచెబుతూ.. రోడ్ ఐలాండ్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జాన్ మెక్‌కానెల్ తన 135 పేజీల సుదీర్ఘ తీర్పులో ఈ వివాదాస్పద విధానాలను కొట్టివేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా దేశ వలస చట్టాలను, పరిపాలనా చట్టాలను ఉల్లంఘించడమేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అసలు ఈ వివాదానికి మూలం వాషింగ్టన్, డి.సి.లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన ఘోర కాల్పుల ఘటన. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తి అఫ్గానిస్థాన్‌కు చెందినవాడు కావడం, అతను గతంలో అమెరికాకు వచ్చి ఆశ్రయం పొందిన వ్యక్తి కావడంతో ట్రంప్ ప్రభుత్వం దీనిని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని "జాతీయ భద్రత" పేరుతో వలస చట్టాలను దుర్వినియోగం కాకుండా కాపాడుతున్నామనే సాకుతో ట్రంప్ సర్కారు ఒకేసారి 39 దేశాలకు చెందిన పౌరులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ 'ప్రయాణ నిషేధ జాబితా' (Travel Ban) ను విస్తరించింది. ఈ దేశాల నుండి వచ్చే వలసదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం కష్టమంటూ వారి ప్రయోజనాలపై నిరవధిక నిషేధాన్ని విధించింది.

Green Card applicants Trump travel ban visa ban US court ruling immigration lawsuit green card processing freeze unlawful freeze federal judge US immigration news permanent residency visa restrictions travel restrictions immigrant rights court blocks freeze green card backlog US

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జాన్ మెక్‌కానెల్, ట్రంప్ పరిపాలనలోని లోపాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సాధారణంగా వలసలపై మాట్లాడేటప్పుడు "చట్టాన్ని పాటించాలి, పద్ధతిగా రావాలి" అని చెప్పే మాటలను గుర్తు చేస్తూ.. ఈ కేసులోని వలసదారులు ఖచ్చితంగా అదే చేశారని నొక్కి చెప్పారు. వీరంతా చట్ట ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ ప్రక్రియలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారని, అయినా ప్రభుత్వం వారిని నిరవధికంగా వేచి ఉండేలా చేయడం అన్యాయమని కోర్టు పేర్కొంది.

Also Read

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సంస్థకు లేని చట్టబద్ధమైన అధికారాన్ని క్లెయిమ్ చేసుకుంటూ, కేవలం 'వలస వ్యతిరేక భావాలను' కప్పిపుచ్చుకోవడానికి జాతీయ భద్రత అనే సాకును వాడుకుందని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నిర్ణయం వల్ల వలసదారులు ఏ తప్పు చేయకపోయినా, కేవలం వారు పుట్టిన దేశం ఆధారంగా వివక్షకు గురై తీవ్రమైన చట్టపరమైన అయోమయంలో పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా వ్యాపార వలసల న్యాయవాదుల సంస్థ ప్రకారం, ఈ తీర్పుతో ట్రంప్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు ప్రధాన వలస విధానాలు పూర్తిగా రద్దయ్యాయి. నిషేధిత 39 దేశాల పౌరుల గ్రీన్‌కార్డు, ఉపాధి అనుమతి, పౌరసత్వ దరఖాస్తుల విచారణను నిరవధికంగా నిలిపివేసే ప్రయోజనాల నిలుపుదల విధానాన్ని కోర్టు రద్దు చేసింది. అలాగే ఏ దేశస్థుడైనా సరే, ఆశ్రయం కోసం లేదా దేశం నుండి బహిష్కరణను నిలిపివేయాలని కోరుతూ చేసుకునే అన్ని దరఖాస్తుల విచారణల నిలిపివేసే గ్లోబల్ అసైలం హోల్డ్ పాలసీని కొట్టివేసింది. దీంతో పాటు నిషేధిత దేశాల నుండి వచ్చి ఇప్పటికే చట్టబద్ధంగా వలస ప్రయోజనాలు పొందిన వారి కేసులను కూడా మళ్లీ తెరిచి పునఃసమీక్షించాలనే సమగ్ర పునఃసమీక్ష విధానాన్ని, అలాగే దరఖాస్తుదారులకు వలస ప్రయోజనాలు ఇచ్చేటప్పుడు వారి దేశాన్ని ఒక ప్రతికూల కారకంగా పరిగణించాలనే దేశ-నిర్దిష్ట కారకాల విధానాన్ని కోర్టు పూర్తిగా రద్దు చేసింది.

ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనల కింద ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య ఖండాలకు చెందిన మొత్తం 39 దేశాలపై పూర్తి లేదా పాక్షిక నిషేధాన్ని విధించింది. ఇందులో అఫ్గానిస్తాన్, ఇరాన్, సిరియా, లిబియా, సోమాలియా, యెమెన్ వంటి 19 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేయగా.. నైజీరియా, వెనిజులా, క్యూబా, జింబాబ్వే వంటి మరో 20 దేశాల పౌరుల ప్రవేశాన్ని పాక్షికంగా నిలిపివేశారు.

గతంలో ఇతర జిల్లాల కోర్టులు ఇచ్చిన తీర్పులు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగా, ఈ తాజా తీర్పు నేరుగా ట్రంప్ ప్రభుత్వ మూల వలస విధానాలనే లక్ష్యంగా చేసుకుని రద్దు చేయడంతో దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉండబోతోంది. అమెరికాకు చట్టబద్ధమైన వలస మార్గాలను కూడా మూసివేయాలని చూస్తున్న ట్రంప్ పరిపాలనకు ఇది కోర్టు ఇచ్చిన అతిపెద్ద ఎదురుదెబ్బ. ప్రభుత్వం దీనిపై పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికైతే వేలాది మంది వలసదారుల ఇళ్లలో ఈ తీర్పు కొత్త వెలుగులు నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+