సొంత దేశంలో వస్తున్న ఫిర్యాదులు అలాగే ఆహార కొరత కారణంగా ట్రంప్ కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్ లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాడు. ముఖ్యంగా బీఫ్, కాఫీ ఉత్పత్తులు, ట్రాపికల్ ఫ్రూట్స్ వంటి ఆహార దిగుమతులపై టారిఫ్ తగ్గిస్తూ ఆయన సంతకం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అమెరికన్లు వరుసగా ఫిర్యాదులు చేస్తుండడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కారణంగా అమెరికాలో కొన్ని వస్తువల ధరలు భారీగా తగ్గనుండడంతో పాటు ఇండియాకు కూడా కొంత మేలు చేకూరే అవకాశం ఉంది. అదెలాగంటే..

భారత్‌తో పాటు పలు ఇతర దేశాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడం, భారత్ పై ఇంకా అదనంగా మరో 25 శాతం టారిఫ్ భారాన్ని మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ సుంకాల కారణంగా అమెరికాలో కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దాంతో అక్కడి ప్రజలు పెద్దమొత్తంలో కంప్లెయింట్స్ చేశారు. దీంతోపాటు అక్కడి డెమొక్రటిక్ పార్టీ కూడా దీనిపై విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ కారణంగా ట్రంప్ టారిఫ్ లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టారిఫ్ రూల్స్ ప్రకారం ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో గింజలు, నారింజ, టొమాటో, బీఫ్ వంటి వాటిపై భారీగా టారిఫ్ తగ్గనుంది. ఇది భారతీయ రైతులకు కొంత మేలు చేకూరుస్తుంది.
వీటిపై మినహాయింపు
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో 2006లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మామిడి పండ్లపై నిషేధాన్ని ఎత్తివేయగా, ఇటీవలే ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రంప్, మోదీల ప్రకటనలో కూడా మామిడి, దానిమ్మ ఎగుమతుల ప్రస్తావన వచ్చింది. అలాగే గతంలో జనరిక్ ఔషధాలకు టారిఫ్ మినహాయింపు ఇవ్వగా, ఇప్పుడు ఆహార ఉత్పత్తులకు కూడా రిలీఫ్ ఇచ్చారు. ఇవన్నీ భారత్ కు కలిసొచ్చే అంశాలే.
రైతులకు ఊరట
ఇకపోతే అమెరికా గొడ్డు మాంసం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. గొడ్డు మాంసం ధర పెరగడానికి ట్రంప్ బ్రెజిల్ పై విధించిన టారిఫ్ కారణమని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. బ్రెజిల్ పై భారీ ఎత్తున టారిఫ్ లు వేయడంతో.. అమెరికా మార్కెట్లో బీఫ్ సరఫరా తగ్గింది. దాంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా ధరలను తగ్గించే దిశగా ట్రంప్ టారిఫ్ లను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం బీఫ్ మీదే కాకుండా టీ, కాఫీ, ఫ్రూట్స్, స్పైసెస్, టొమాటో వంటి రోజువారీ వస్తువులపై కూడా టారిఫ్ లు తగ్గాయి. దీని వల్ల ఇండియా సహా పలు దేశాల్లోని రైతులకు కొంత ఊరట లభించినట్టయింది.


Click it and Unblock the Notifications