Trump Tariff Twist : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలతో విరుచుకుపడిన సంగతి విదితమే. భారత దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సుంకాల ప్రభావం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వస్త్ర ఎగుమతిదారులపై పడింది. నిట్వేర్ హబ్ గా పేరుగాంచిన తిరుప్పూరులో 20 వేల కి పైగా చిన్న, మధ్యతరహా తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఈ యూనిట్ల ద్వారా దాదాపు 30 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడే ఈ పరిశ్రమకు కొత్తగా విధించిన 25 శాతం సుంకాలు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
తిరుప్పూర్ ఎగుమతిదారుల సంఘం జాయింట్ సెక్రటరీ కుమార్ దురైసామి మాట్లాడుతూ.. ఈ క్లస్టర్‌లో సుమారు 2,500 ఎగుమతిదారులు, 20 వేల స్వతంత్ర యూనిట్లు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిట్వేర్ ఎగుమతుల్లో 68 శాతం వాటా తిరుప్పూరుదే. గత ఆర్థిక సంవత్సరంలో COVID-19, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో కూడా రూ. 44,744 కోట్ల టర్నోవర్ ఇక్కడి నుండే నమోదు అయింది.ఏకంగా అనంతరం 20 శాతం వృద్ధిని కూడా నమోదు చేయగలిగామని తెలిపారు.

తిరుప్పూర్ లో తయారు చేసే లోదుస్తులు, బేబీ సూట్లు, స్లీప్‌వేర్ వంటి ఉత్పత్తులకు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. ఈ కారణంగా తిరుప్పూర్ ఎగుమతుల్లో 40 శాతం అమెరికా మార్కెట్‌దే కాగా, మరో 40 శాతం యూరప్, 10 శాతం యూకే, మిగిలిన 10 శాతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే, తాజాగా అమెరికా విధించిన అధిక సుంకాలు వినియోగదారుల మార్జిన్‌లు తగ్గాయనీ, స్వల్ప లాభంతో నెట్టుకుస్తున్న యూనిట్లు ఈ భారాన్ని భరించలేవని దురైసామి తెలిపారు.
కొనుగోలుదారులు ఆగస్టు 27నాటికి ఇప్పటికే తయారైన వస్తువులను పంపమనడం మాత్రమే కాకుండా, సుంకంలో కొంత భాగాన్ని తాము వసూలు చేస్తామని కూడా సూచించారు. అయితే మరోసారి 25 శాతం సుంకం ప్రకటించడంతో చాలా మంది ఆర్డర్లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి తక్షణంఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం వస్తువుల ఎగుమతుల్లో 20 శాతం USకు వెళ్లాయి. తమిళనాడుకు చెందిన 52.1 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో 31 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. దీనివల్ల రాష్ట్రం చాలా దుర్బల స్థితిలోకి వెళ్లిపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
వస్త్ర రంగం దేశంలో సమగ్రంగా 75 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నదని గుర్తు చేసిన సీఎం స్టాలిన్..ప్రస్తుత 25 శాతం సుంకానికి తోడు ప్రతిపాదిత 50 శాతం సుంకం అమలు అయితే.. దాదాపు 30 లక్షల ఉద్యోగాలు తక్షణ ప్రమాదంలో పడతాయన్నారు. కేవలం తాత్కాలిక సాయం మాత్రమే కాకుండా, ఎగుమతిదారుల పోటీతత్వాన్ని అడ్డుకుంటున్న నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడం ఇప్పటికైనా అత్యవసమని సూచించారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications