అమెరికా ప్రజల నడ్డి విరిచిన ట్రంప్..ఒక్కో కుటుంబంపై రూ. 2 లక్షలు భారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల ఆంక్షలు ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉన్నాయి. ఇటీవల విధించిన భారీ దిగుమతి సుంకాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. యేల్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ట్రంఫ్ టారిఫ్ సుంకాల ప్రభావం అమెరికాలో మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేయనున్నాయి.

ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రతి అమెరికన్ కుటుంబానికి సగటున రూ. 2 లక్షల (2,400 డాలర్లు) వరకూ నష్టం వాటిల్లనుందని నివేదిక తేల్చి చెప్పింది. అమెరికా తన దిగుమతులపై సగటున 20 శాతం సుంకం విధించింది, ఇది అమెరికా మార్కెట్లో వస్తువులను ఖరీదైనదిగా చేయడమే కాకుండా.. భారతదేశం వంటి దేశాల వాణిజ్యం, ఎగుమతిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ ప్రభావం రోజువారీ వినియోగ వస్తువుల ధరల పెరుగుదలపై పడనుంది. బూట్లు, దుస్తులు, హ్యాండ్‌బ్యాగులు, కారు వంటి వస్తువులపై సుంకాలు భారీగా పెరగడంతో..వాటి ధరలు అమెరికాలో 20 శాతం నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఆహార ధరలూ సగటున 3.4 శాతం పెరగనుండగా..కూరగాయల ధరలు 7 శాతం వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ముఖ్యంగా అమెరికాలో మిడిల్ క్లాస్ ప్రజల జీవనం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోనుందని నివేదిక తెలిపింది.

Trump tariffs 2025 Trump import duties US-China trade war impact Trump tariff effect on families American household income loss Trump economic policy 2025 US tariff impact on prices Rs 2 lakh loss per family US trade war consequences Trump tariffs India impact Trump policy middle class burden 2

SBI నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే.. అమెరికా ప్రతి సంవత్సరం ఇతర దేశాల నుండి దాదాపు 3.26 ట్రిలియన్ డాలర్ల (రూ. 272 లక్షల కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ మొత్తం దిగుమతిపై 20 శాతం పన్ను విధించినప్పుడు..వస్తువుల ధర మొదటి స్థాయిలోనే పెరుగుతుంది. ఇది క్రమంగా వినియోగదారునికి చేరుతుంది. ఈ పన్ను కారణంగా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) వెంటనే 2.4 శాతం పెరగవచ్చని, 1.2 శాతం పెరుగుదల దీర్ఘకాలికంగా కూడా కొనసాగవచ్చని నివేదిక పేర్కొంది.

ఈ పన్ను కారణంగానే ప్రతి అమెరికన్ కుటుంబం సంవత్సరానికి సగటున $2,400 (సుమారు రూ. 2 లక్షలు) నష్టపోతుందని SBI అంచనా వేసింది. పేద కుటుంబాలు ఆదాయం ఎక్కువ భాగం ద్రవ్యోల్బణం వల్ల కోల్పోతుంది. మరోవైపు ధనిక కుటుంబాలు కూడా (సుమారు $5,000) కోల్పోయినప్పటికీ, వారి జీవన ప్రమాణాలపై దాని ప్రభావం అంత తీవ్రంగా ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది.

JP మోర్గన్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే.. ట్రంప్ విధించిన సుంకాల వల్ల 2025 నాటికి అమెరికన్ వృద్ధి రేటు 0.5 శాతం పాయింట్లు తగ్గిపోవచ్చని అంచనా. దీంతో పాటుగా సుమారు 5 లక్షల ఉద్యోగాలు కోల్పోవచ్చని తెలిపింది. ఈ విధానాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతూనే..వినియోగదారుల డిమాండ్‌ను తగ్గించడానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా నడిపిస్తోందని తెలిపింది. CBO (Congressional Budget Office) కూడా ట్రంప్ విధించిన పన్నులు తక్కువకాల ఆదాయం ఇచ్చినా.. దీర్ఘకాలంలో వృద్ధిని గణనీయంగా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో ధనిక వర్గాలు డాలర్ల పరంగా ఎక్కువ నష్టాలను చవిచూసినా.. తక్కువ ఆదాయ కుటుంబాలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది వారి ఆదాయంలో వాటాగా కొలిచినప్పుడు ఇది మూడు రెట్లు అధికంగా ఉండవచ్చని యేల్ నివేదిక స్పష్టం చేసింది. ఒకసారి ధరలు పెరిగిన తర్వాత, వేతనాలు పెరగకపోతే వాస్తవ ఆదాయం క్షీణిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

భారతదేశానికి అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. FY25లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో 20 శాతం USకి వెళ్ళాయి. FY26 మొదటి కొన్ని నెలల్లో ఇది 22.4శాతానికి పెరిగింది. భారతదేశం ఎగుమతి చేసే 15 ప్రధాన ఉత్పత్తులలో 63 శాతం USకి మాత్రమే ఎగుమతి చేయబడతాయి. అటువంటి పరిస్థితిలో.. USలో ద్రవ్యోల్బణం పెరిగి, పన్నుల కారణంగా భారతీయ వస్తువులు ఖరీదైనవిగా మారితే.. భారతదేశ ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించడంతో..భారత వాణిజ్యానికి పెద్ద దెబ్బ తగలనున్నది. అమెరికా భారత్‌ను మిత్రదేశంగా చూస్తూనే వాణిజ్య పరంగా శిక్షించే విధానాన్ని అవలంబించడం వాషింగ్టన్ విధానంలోని ద్వంద్వ నైపుణ్యాన్ని చాటుతోంది. దీనికి ప్రతీకార చర్యలుగా భారత్ కూడా దిగుమతులపై సుంకాలు విధించే అవకాశముంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+