అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారతదేశాన్ని చనిపోయిన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించిన సంగతి విదితమే. అయితే ఆ చనిపోయిన ఆర్థిక వ్యవస్థలోనే ఆయనకు చెందిన సంస్థ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ ఇండియా మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించుకుంటూ పోతోంది. గత పదేళ్లలో ట్రంప్ బ్రాండ్ భారత్‌లో అత్యంత వేగంగా పెరిగింది.2012లో ప్రారంభించిన తొలి ప్రాజెక్ట్ నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో 11 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించబడాయి.
ముంబై, పూణే, కోల్‌కతా, నోయిడా, హైదరాబాద్, బెంగళూరు గురుగ్రామ్‌లలో మొత్తం ఏడు ప్రాజెక్టుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 175 కోట్ల రూపాయలకు పైగానే ఆర్జించింది. 2024 నవంబర్‌లో ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ట్రంప్ ఆర్గనైజేషన్ భారతీయ భాగస్వామి ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి గురుగ్రామ్, పూణే, హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూరు నగరాల్లో కొత్తగా ఆరు లగ్జరీ ప్రాజెక్టులను ప్రకటించింది. ఈ కొత్త వెంచర్లు కనీసం రూ.15 వేల కోట్ల విలువైన అమ్మకాల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ట్రిబెకా వెల్లడించింది.

ప్రస్తుతం ప్రారంభమైన మూడు ప్రధాన ప్రాజెక్టులు పూణే, గురుగ్రామ్, హైదరాబాద్‌లలో ఉన్నాయి.. ఇవి మూడు కలిపి సుమారు 4.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. గతంలో ట్రంప్ బ్రాండ్ అభివృద్ధి చేసిన ప్రాంతం సుమారు 3 మిలియన్ చదరపు అడుగుల మేర ఉండగా, తాజా ప్రాజెక్టులతో కలిపి ఇది నాలుగు రెట్లు పెరిగి 11 మిలియన్లకు చేరనుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశం ప్రస్తుతం ట్రంప్ ఆర్గనైజేషన్‌కు అత్యంత లాభదాయకమైన గమ్య స్థానంగా మారింది.
ప్రముఖ బిల్డర్లతో భాగస్వామ్యం ద్వారా లాభదాయకమైన ఒప్పందాలను సాధించింది. ట్రంప్ సంస్థ స్వయంగా నిర్మాణంలో పెట్టుబడి పెట్టకుండానే బ్రాండ్ లైసెన్సింగ్ ద్వారా ముందస్తు రుసుములు, అలాగే అమ్మకాల్లో 3-5 శాతం వాటా ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్ గల ప్రాజెక్టులు ప్రధానంగా లగ్జరీ సెగ్మెంట్‌కు చెందినది. అమెరికా అధ్యక్షుడి పేరు యాడ్ చేయడం వల్ల..ఈ ఫ్లాట్లు మార్కెట్ రేటుతో పోలిస్తే ప్రీమియంగా అమ్మకాలు జరుపుతున్నాయి.
ఈ ప్రాజెక్టులు దేశీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ట్రంప్‌కి ప్రత్యేక స్థానాన్ని కలిగించాయి.క్లుప్తంగా చెప్పాలంటే ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశంలో తన ఫుట్‌ప్రింట్‌ను భారీగా విస్తరిస్తోంది. ఇది ట్రంప్ బ్రాండ్‌కు మాత్రమే కాకుండా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కూ కీలకమైన మలుపుగా కూడా చెప్పుకోవచ్చు.
దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), లోధా గ్రూప్, M3M, బ్రిగేడ్ గ్రూప్, పంచశీల్ రియల్టీ, ఐఆర్ఏ ఇన్‌ఫ్రా, యూనిమార్క్ వంటి సంస్థల పోటీ మధ్య ట్రంప్ బ్రాండ్ తనకు తానే ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ వస్తోంది. కల్పేష్ మెహతా నేతృత్వంలో బెకా డెవలపర్స్ ట్రంప్ ఆర్గనైజేషన్‌కు భారతదేశంలో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, లగ్జరీ లైవింగ్ వంటి విభాగాల్లో ట్రంప్ ఆర్గనైజేషన్ తన కార్యకలాపాలను విస్తరించింది.
ట్రంప్ మరో బాంబు.. భారత మందులపై 250 శాతం సుంకాలు,ఫార్మా రంగంలో భయాందోళనలు
ట్రంప్ కుటుంబానికి చెందిన ఈ సంస్థలో మెజారిటీ వాటా డొనాల్డ్ ట్రంప్‌కు చెందింది. ఆయన కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా వ్యవహరిస్తున్నారు. 2017లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్.. సంస్థ అధికార బాధ్యతలను తన కుమారులకు అప్పగించారు. అయినప్పటికీ, సంస్థ వ్యాపార మార్గదర్శకత్వంపై ట్రంప్ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు.
అయితే ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్మాణ కార్యకలాపాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం లేదు. పేరు (బ్రాండ్)ను లైసెన్స్ ద్వారా విక్రయిస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. డెవలపర్లు ట్రంప్ బ్రాండ్‌ను ఉపయోగించే ప్రతిసారి సంస్థకు ముందస్తు రుసుములు లేదా అమ్మకాలలో శాతం వాటా లభిస్తుంది. అమెరికా ఎన్నికల ముందు అక్టోబర్ 16న డీటీ మార్క్స్ హైదరాబాద్ ఎల్ఎల్సీని ట్రంప్ స్థాపించగా.. రెండో సారి 2024 నవంబర్‌లో అధ్యక్షుడైన తర్వాత డీటీ మార్క్స్ నోయిడా 94 ఎల్ఎల్సీ, డీటీ మార్క్స్ గుర్గావ్ 111, 69 ఎల్ఎల్సీలు, డీటీ మార్క్స్ పూణే ముంధ్వా ఎల్ఎల్సీ వంటి కంపెనీలను ప్రారంభించారు.
2024 సంవత్సరంలో ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశం నుండి సుమారు 12 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. ఇది సంస్థకు భారత్‌లో ఉన్న గణనీయమైన వాణిజ్య అవకాశాలను సూచిస్తుంది. ట్రైబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా.. పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ బిజినెస్ స్కూల్ లో విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే ఆయనకూ ఓ ప్రొఫెసర్
ద్వారా ట్రంప్‌తో పరిచయం అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా 2024 నవంబర్‌లో హిందుస్తాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే పరిచయం ట్రంప్ బ్రాండ్‌ను భారత మార్కెట్‌కు తీసుకురావడంలో కీలకమైనదిగా మారింది.
More From GoodReturns

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. కాల్పుల విరమణపై ఏమన్నారంటే..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ఎఫెక్ట్.. ధరల పెరుగుదలపై ఆందోళన..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

ఖతార్ LNG ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు



Click it and Unblock the Notifications