అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి.. 'థర్డ్ వరల్డ్ కంట్రీస్' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అన్నాడు. అసలు దీని అర్థం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

థర్డ్ వరల్డ్ కంట్రీస్' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని, దేశానికి నెట్ అసెట్ కాని వారిని తొలగిస్తామని ట్రంప్ (trump) ఇటీవల ప్రకటించారు. ఈ విధానాన్ని ఆయన 'రివర్స్ మైగ్రేషన్' (Reverse Migration)గా అభివర్ణించారు. ఈ విధమైన కఠిన వలస విధానాలు అమెరికాపై భారీ ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. అదెలాగంటే..
వలస విధానాలు vs. ఆర్థిక లాభాలు
ట్రంప్ దృష్టిలో ప్రస్తుత వలస విధానాలు దేశ అభివృద్ధిని దెబ్బతీశాయి. అయితే, ఆర్థికవేత్తలు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అమెరికాలోని టెక్నాలజీ దిగ్గజాలు, అగ్రగామి పరిశోధనా సంస్థలు ఎక్కువగా వలస వచ్చిన నిపుణులపై ఆధారపడతాయి. ముఖ్యంగా, భారత్, చైనా వంటి దేశాల నుండి వచ్చిన ప్రతిభావంతులు టెక్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్‌ల స్థాపనకు కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ పాలనలో వలసలను కఠినతరం చేస్తే, ఈ టాలెంట్ పూల్ తగ్గిపోయి, అమెరికా యొక్క సాంకేతిక పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు కేవలం అధిక నైపుణ్యం ఉన్నవాళ్లే కాదు శ్రామికులు కూడా కావాలి. తక్కువ నైపుణ్యం అవసరమయ్యే వ్యవసాయం, నిర్మాణం, ఆతిథ్యం వంటి రంగాలకు వలస కార్మికులు ఎంతో అవసరం. 'రివర్స్ మైగ్రేషన్' అమలైతే ఈ రంగాలలో శ్రామిక శక్తి కొరత ఏర్పడి వేతనాలు పెరిగి, అంతిమంగా వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది.
సెక్యూరిటీ రిస్క్
ట్రంప్ (trump) .. దేశ భద్రతకు ముప్పుగా మారే వారిని బహిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అలాగే వలసదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడేవారు కాకూడదనే నిబంధనను కూడా అమలు చేయాలని చూస్తున్నారు. నాన్-సిటిజన్లకు ఇచ్చే అన్ని ఫెడరల్ ప్రయోజనాలు, రాయితీలను రద్దు చేస్తామని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇది వలసదారుల కుటుంబాలపై ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఆర్థిక భారం పెంచుతుంది.
బిజినెస్ వర్గాల్లో ఆందోళన
ట్రంప్ ప్రకటన కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, అనేక అమెరికన్ కంపెనీలకు ఇది ప్రధాన వ్యాపార ఆందోళన. చాలామంది వ్యాపార నాయకులు నైపుణ్యం కలిగిన వలసదారులను సమర్థిస్తారు. మొత్తం మీద, 'రివర్స్ మైగ్రేషన్' విధానం అమలులోకి వస్తే.. కార్పొరేట్ అమెరికా తమ టాలెంట్ అక్విజిషన్ వ్యూహాలను మార్చుకోవలసి వస్తుంది. ఇది వారి వృద్ధి రేటును ప్రభావితం చేయవచ్చు.
మిగతా రంగాలపై కూడా..
డొనాల్డ్ ట్రంప్ తరచుగా ప్రస్తావించే ఈ కఠిన విధానాలు, అమెరికాలో వ్యాపారాలు తమ దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించుకోవడంలో అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి విధానాల వల్ల టెక్నాలజీ, హెల్త్‌కేర్, విద్య వంటి రంగాలకు అవసరమైన నిపుణులను నియమించుకోవడంలో ఆలస్యం లేదా వైఫల్యం సంభవించవచ్చు. వలసదారులు కూడా ఆదాయం, పన్నుల ద్వారా అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతోకొంత దోహదపడతారు. వారిని అడ్డుకుంటే అది అమెరికా GDP వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications