Trump Putin summit : రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై ట్రంప్ మండిపడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీపై ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసింది. ఎట్టకేలకు అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎటువంటి ప్రాధాన్యతా అంశాలు లేకుండానే మగిసింది.
ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం, యూరోప్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నాటో చర్యలు వంటి అంశాలే ఈ సమావేశంలో ఎజెండాగా ఉంటాయని విశ్లేషకులు భాశించారు. అలాగే ఈ సమావేశంలో ఏదైనా ఒక కీలక ఒప్పందం వెలువడుతుందని అంచనాలు వేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సమావేశం ఎలాంటి అధికారిక ఒప్పందం లేకుండానే ముగిసింది. తుది డావొస్కా అజెండాలు లేకపోయినా.. మూడు గంటల పాటు ఇరువురు నేతలు నేరుగా ముఖాముఖి చర్చలు జరిపారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ సమావేశం చాలా సానుకూలంగా సాగింది. అనేక కీలక అంశాలపై మేము అభిప్రాయాల్ని పంచుకున్నామన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం సాధించే దిశగా మేము పలు కీలక అంశాలపై ఒక అవగాహనకు వచ్చాము. కానీ అధికారిక ఒప్పందానికి సంతకం చేయడానికి ఇంకా కొన్ని చర్చలు జరగాల్సి ఉందని స్పష్టం చేశాడు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఝెలెన్స్కీతో పాటు యూరోపీయ యూనియన్ నేతలతో చర్చలు జరిపి తదుపరి నిర్ణయంపై ముందుకు వెళతామని ట్రంప్ తెలిపాడు. అలాగే, తన తదుపరి సమావేశం మాస్కోలోనే జరుగుతుందన్నారు.
ఇదే సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగానే జరిగింది. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధానంగా చర్చించామని చెప్పేందుకు ఏమాత్రం సందేహం లేదు. ఈ సమావేశం కొంతవరకు సంక్షోభ పరిష్కారానికి బలం చేకూర్చింది. ట్రంప్‌తో నాకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అతను ఈ దశలో మధ్యవర్తిత్వానికి ముందుకు రావడం ఎంతో ప్రోత్సాహకరమని తెలిపారు.అలాగే 2022లో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగి ఉండేది కాదేమోనని తెలిపారు.
తదుపరి సమావేశం కోసం డొనాల్డ్ ట్రంప్‌ను మాస్కోకు రావాలని పుతిన్ ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రత్యక్ష ఒప్పందాలు కుదరకపోయినా, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య అతి సమీపంలో మరొక కీలక సమావేశం జరగనున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ సముదాయం దృష్టంతా మాస్కోలో జరగనున్న తదుపరి ట్రంప్-పుతిన్ భేటీపైనే నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా ఈ నిరసనల మధ్య కనీసం మౌలిక అవగాహన ఏర్పడడటమే ఈ సమావేశం ముందడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications